Hyderabad: అమావాస్య రోజున హైదరాబాద్‌లో దారుణం.. 8 ఏళ్ల బాలుడిని నరబలి ఇచ్చిన మహిళ

|

Apr 21, 2023 | 11:44 AM

హైదరాబాద్‌ సనత్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ 8 ఏళ్ల బాలుడ్ని నరబలి ఇచ్చింది. ఈ ఘటనలో బలైన బాలుడు అబ్దుల్‌ వహీద్‌గా గుర్తించారు. అమావాస్య వేళ ఆ మహిళ బలి ఇచ్చినట్లుగా స్థానికుల ఆరోపిస్తున్నారు. ఓ నాలా సమీపంలో బాలుడి..

Hyderabad: అమావాస్య రోజున హైదరాబాద్‌లో దారుణం.. 8 ఏళ్ల బాలుడిని నరబలి ఇచ్చిన మహిళ
Representative Image
Follow us on

హైదరాబాద్‌ సనత్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ 8 ఏళ్ల బాలుడ్ని నరబలి ఇచ్చింది. ఈ ఘటనలో బలైన బాలుడు అబ్దుల్‌ వహీద్‌గా గుర్తించారు. అమావాస్య వేళ ఆ మహిళ బలి ఇచ్చినట్లుగా స్థానికుల ఆరోపిస్తున్నారు. ఓ నాలా సమీపంలో బాలుడి మృతదేహం లభించడంతో సదరు మహిళ ఇంటిపై స్థానికులు దాడికి దిగారు. దీంతో సనత్‌నగర్‌లోని అల్లాదున్ కోటి ఏరియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సనత్‌నగర్‌ పారిశ్రామికవాడలోని అల్లాదున్‌ కోటిలో నివసించే రెడీమేడ్‌ దుస్తుల వ్యాపారి వసీంఖాన్‌ కుమారుడు (8)ను స్థానికంగా నివసించే ఫిజాఖాన్‌ అనే ఓ మహిళ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చిట్టీల వ్యాపారం నిర్వహించే ఫిజాఖాన్‌ వద్ద వసీంఖాన్‌ చిట్టీలు వేశాడు. దీనికి సంబంధించిన డబ్బును ఫిజాఖాన్‌ ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య గురువారం గొడవ జరిగింది. ఈక్రమంలోనే నిన్న సాయంత్రం వసీంఖాన్‌ కుమారుడిని నలుగురు వ్యక్తులు అపహరించారు. బాలుడు కనిపించకపోవడంతో తండ్రి వసీంఖాన్‌ రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్థానికులు ఇచ్చిన సమాచారం, సీసీ ఫుటేజీల ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు.

కాగా బాలుడి మృతదేహాన్ని జింకలవాడ సమీపంలోని ఓ నాలాలో వేసినట్లు నిందితులు అంగీకరించారు. దీంతో గురువారం అర్ధరాత్రి పోలీసులు స్థానికుల సహాయంతో నాలాలో వెతికారు. ఓ ప్లాస్టిక్‌ సంచిలో మృతదేహం ఉన్నట్లు గుర్తించి వెలికి తీశారు. కాగా బాలుడిని హత్య చేసిన నిందితులు.. ఎముకలను ఎక్కడిక్కడ విరిచి ఓ బకెట్‌లో కుక్కారు. అనంతరం బకెట్‌ను ప్లాస్టిక్‌ సంచిలో వేసి వెళ్లి నాలాలో విసిరేసినట్లు తెలిసింది. బాలుడిని నరబలి ఇచ్చినట్లుగా బస్తీవాసులు చెబుతున్నారు. మరోవైపు చిట్టీ డబ్బుల గొడవ కారణంగానే హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..