Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లు జలమయం.. మరో రెండు రోజుల పాటు..

|

Sep 22, 2022 | 12:38 PM

Hyderabad Rains: గత కొన్ని రోజులుగా ఎడతెరిపినిచ్చిన వరుణుడు మళ్లీ తన ప్రతాపం చూపించాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లు జలమయం.. మరో రెండు రోజుల పాటు..
Hyderabad Rains
Follow us on

Hyderabad Rains: గత కొన్ని రోజులుగా ఎడతెరిపినిచ్చిన వరుణుడు మళ్లీ తన ప్రతాపం చూపించాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బండ్లగూడ, మణికొండ, నార్సింగి, రాజేంద్ర నగర్‌, అత్తాపూర్‌, కిస్మత్‌ పూరా, గండిపేట్‌, ఆరాంఘర్‌, శంషాబాద్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అలాగే పాత బస్తీ చాంద్రాయణ గుట్ట, ఫలక్‌నుమా, బర్కాస్‌, మియాపూర్‌, చందానగర్‌, మదీనా గూడ, మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపుర్ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు పూర్తిగా జలమయయ్యాయి. అలాగే చిక్కడపల్లి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, బాగ్‌లింగంపల్లి, కవాడిగూడ, బోలక్‌పూర్, దోమలగూడ, గాంధీనగర్ జవహర్ నగర్, లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతాల్లోనూ రోడ్లు చెరువులను తలపించాయి.

అలాగే బోరబండ, ఎర్రగడ్డ, సనత్ నగర్, ఎస్ఆర్ నగర్, వెంగల్ రావు నగర్, యూసఫ్‌ గూడ, మైత్రివనం, అమీర్‌పేట , పంజాగుట్ట, ఖైరతాబాద్, సోమాజిగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోనూ వర్షం పడుతోంది. కాగా వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దీంతో ఉద్యో్గులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంతమంది వాహనదారులు గంటల తరబడి మెట్రో పిల్లర్ల కింద నీరీక్షించాల్సి వచ్చింది. కాగా బంగాళఖాతంలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు నగరవాసులకు సూచిస్తున్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..