Hyderabad: వినాయక చవితి వేడుకలకు అంతా సిద్ధమవుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల పర్యవారణానికి కలిగే నష్టాలు ఎలాంటివో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే పర్యావరణ సంరక్షణలో భాగంగా మట్టి గణపతులనే పూజించాలని ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు పిలుపునిస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా పర్యావరణ హితం కోసం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా జోనల్ వారిగా మూడు లక్షల మట్టి గణేష్ ప్రతిమలను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు.
మట్టి విగ్రహాల పంపిణీ శనివారం నుంచి ప్రారంభించారు. ఇప్పటికే మూడు లక్షల విగ్రహాలు తయారు చేయగా, అవసరం మేరకు లక్ష ప్రతిమలను సిద్దం చేసి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా మట్టి గణపతులను పూజించాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రజలను కోరారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన మండపాల వద్ద పరిశుభ్రంగా ఉంచుకోవాలని మేయర్ సూచించారు. జోన్‌ల వారీగా మట్టి గణపతులు కావాల్సిన వారు ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించండి..
యూసుఫ్ గూడ సర్కిల్ డా.ఎల్.బిందు భార్గవి (ఏ.ఎం.ఓ.హెచ్) ఫోన్ నెం. 7995079809. శేరిలింగంపల్లి సర్కిల్ డా.ఎన్.నగేష్ నాయక్ (ఏ.ఎం.ఓ.హెచ్) ఫోన్ నెం. 9704405094. చందానగర్ సర్కిల్ డా.బి.కార్తిక్ (ఏ.ఎం.ఓ.హెచ్) ఫోన్ నెం. 9154295227. ఆర్.సి పురం, పటాన్ చెరువు సర్కిల్ కార్తీ కుమార్ (డిప్యూటి ఇ.ఇ, ఎస్.డబ్ల్యూ ఎం) ఫోన్ నెం. 9966926555.
మెహిదీపట్నం సర్కిల్ డా.బి.విజయ రామ్మోహన్ రావు (ఏ.ఎం.ఓ.హెచ్) ఫోన్ నెం. 9885198396. కార్వాన్ సర్కిల్ బి.వెంకట రాజు (డిప్యూటీ ఇ.ఇ, ఎస్.డబ్ల్యూ ఎం) ఫోన్ నెం. 9849906752. గోషామహల్ సర్కిల్ డా.పి.శ్రీకాంత్ రెడ్డి (ఏ.ఎం.ఓ.హెచ్) ఫోన్ నెం. 8919846493. ఖైరతాబాద్ డా.పి.భార్గవ్ నారాయణ (ఏ.ఎం.ఓ.హెచ్) ఫోన్ నెం. 8374865307. జూబ్లీహిల్స్ సర్కిల్ శివానంద్ (ఏ.ఇ) ఫోన్ నెం. 9959094933. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం డా.కె.పద్మజ (సి.ఎం.ఓ.హెచ్) ఫోన్ నెం. 6309919076.
కాప్రా సర్కిల్ లో డా. కె.స్వప్న (ఏ.ఎం.ఓ.హెచ్) ఫోన్ నెం. 9666333041, ఉప్పల్ సర్కిల్ చందన (డిప్యూటి ఇ.ఇ, ఎస్.డబ్ల్యూఎం) ఫోన్ నెం. 9701363239. హయత్ నగర్ సర్కిల్ డా.శ్రీనివాస్ రేచర్ల (ఏ.ఎం.ఓ.హెచ్) ఫోన్ నెం. 9010617687. ఎల్బీనగర్ సర్కిల్ వెంకటేష్ (డిప్యూటి ఇ.ఇ, ఎస్.డబ్ల్యూఎం) ఫోన్ నెం. 9701365515. సరూర్ నగర్ సర్కిల్ నీలిమ (డిప్యూటి ఇ.ఇ ఎస్.డబ్ల్యూఎం) ఫోన్ నెం. 9000114676.
మలక్ పేట్, సంతోష్ నగర్ సర్కిళ్లకు మహమ్మద్ ఇర్షద్ ఇక్బాల్ (ఏ.ఎం.ఓ.హెచ్) ఫోన్ నెం. 8143000030. చాంద్రాయణగుట్ట సర్కిల్ ఎస్.ప్రశాంత్ (డిప్యూటి ఇఇ, ఎస్.డబ్ల్యూ ఎం) ఫోన్ నెం. 7331189503. చార్మినార్ సర్కిల్ ఎ.శ్రీనివాస్ (డిప్యూటి ఇఇ ఎస్.డబ్ల్యూ ఎం) ఫోన్ నెం. 915486560. ఫలక్ నూమా (డిప్యూటి ఇ.ఇ, ఎస్.డబ్ల్యూ ఎం), రాజేంద్రనగర్ ఆంజనేయులు (ఇన్ చార్జి ఏ.ఎం.ఓ.హెచ్) ఫోన్ నెం. 9652644275.
మూసాపేట్ సర్కిల్ డా.వై.వెంకటరమణ (ఇన్ చార్జి ఏ.ఎం.ఓ.హెచ్) ఫోన్ నెం. 9154299692. కూకట్ పల్లి జోన్ డా.బి.మమత (ఏ.ఎం.ఓ.హెచ్) ఫోన్ నెం. 7981519957. కుత్బుల్లాపూర్ సర్కిల్ ప్రశాంతి (ఇన్ చార్జి డిప్యూటీ ఇ.ఇ, ఎస్.డబ్ల్యూ ఎం) ఫోన్ నెం. 9963833011. గాజుల రామారం సర్కిల్ ప్రశాంతి (డిప్యూటీ ఇ.ఇ ఎస్.డబ్ల్యూ ఎం) ఫోన్ నెం. 9963833011. అల్వాల్ సర్కిల్ హరిబాబు (ఇన్ చార్జి ఏం.ఎం.సి) ఫోన్ నెం. 9000994012.
ముషిరాబాద్ సర్కిల్ డా.వై.మైత్రేయి (ఏ.ఎం.ఓ.హెచ్) ఫోన్ నెం. 9000115239. అంబర్ పేట్ సర్కిల్ డా.ఎం.జ్యోతి బాయి (ఏ.ఎం.ఓ.హెచ్) ఫోన్ నెం. 6309999493. మల్కాజ్ గిరి సర్కిల్ శ్రీమతి జె.ఎస్.మాధవి (డిప్యూటీ ఇ.ఇ, ఎస్.డబ్ల్యూ ఎం) ఫోన్ నెం. 8106556160. సికింద్రాబాద్ డా.డి.రవీందర్ గౌడ్ (ఏ.ఎం.ఓ.హెచ్) ఫోన్ నెం. 7993360302, బేగంపేట్ సర్కిల్ శ్రీ కె. ప్రవీణ్ కుమార్ (డిప్యూటి ఇ.ఇ, ఎస్.బ్ల్యూ ఎం) ఫోన్ నెం. 9908017194.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..