Hyderabad: ఒక్కో బ్రూ ప్యాకెట్ రూ.6 వేలు.. విప్పి లోపల ఏముందో చూస్తే.. దిమ్మతిరిగిపోద్ది

ఇందు గలదు.. అందు లేదని.. సందేహము వలదు.. ఇప్పుడు ఎందెందు వెతికినా డ్రగ్స్ గుప్పుమంటుంది. తాజాగా హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ రాకెట్ బయటపడింది.

Hyderabad: ఒక్కో బ్రూ ప్యాకెట్ రూ.6 వేలు.. విప్పి లోపల ఏముందో చూస్తే.. దిమ్మతిరిగిపోద్ది
representative image
Follow us

|

Updated on: May 24, 2022 | 3:34 PM

Telangana: బ్రూ చిన్న.. చిన్న ప్యాకెట్స్ గురించి మీకు తెలుసు కదా. ప్రతి చిన్న కిరాణా షాపులో అవి వేలాడుతూ కనిపిస్తాయి. ఆ ప్యాకెట్ ఒక్కొక్కటి  6 వేలు అంటే నమ్ముతారా… అదేంటి 10 రూపాయలేగా.. మేము రెగ్యులర్‌గా కొంటాం…. 6 వేలు ఏంటని వాపోతున్నారా..? నిజమండీ బాబు. కాకపోతే ఆ ప్యాకెట్స్ అన్ని చోట్లా దొరకవ్.. అందరికీ అమ్మరు. అవును ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. అక్కడ ప్యాకెట్ మాత్రమే బ్రూ కంపెనీది. లోపలున్న సరుకు కథ వేరు. బ్రూ ప్యాకెట్స్ మాటున కవరింగ్ ఇచ్చి డ్రగ్స్ విక్రయిస్తున్నాడు ఓ ఫారెనర్. హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌ వ్యవహారం కలకలం సృష్టించింది. 56 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకుని ముగ్గుర్ని అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. పురానాపూల్(Purana Pul) వద్ద కొకైన్(Cocaine) అమ్ముతుండగా మోరిస్ అనే ఆఫ్రీకన్ దేశస్తుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో కీలకమైన విషయాలు రాబట్టారు. బ్రూ కాఫీ ప్యాకెట్లలో ఎవరికి అనుమానం రాకుండా… వనస్థలిపురం, సన్ సిటీ నుండి ఈ డ్రగ్స్ సప్లయ్ అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఒక్కో ప్యాకెట్‌లో ఒక్కో గ్రాము కొకైన్ ఉంటుంది. ఢిల్లీ నుంచి తీసుకొచ్చి పాతవాళ్లకు ఐదు వేల రూపాయలు, కొత్త వాళ్లకు ఆరు వేలు చొప్పున గ్రామ్ కొకైన్ విక్రయిస్తున్నట్లు హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్ తెలిపారు. దీనిపై లోతైన  దర్యాప్తు చేస్తున్నామని.. ఈ లింక్‌తో సంబంధమున్న అందర్నీ అదుపులోకి తీసుకుంటామని ఆయన చెప్పారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..