AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కూకట్‌పల్లిలో దుకాణం.. డబ్బులిస్తే ఏ సర్టిఫికేట్స్ అయినా ఇస్తారు

విదేశీ ఉద్యోగాల కలలు కన్న అభ్యర్థులను లక్ష్యంగా చేసుకున్న నకిలీ సర్టిఫికెట్ ముఠాను సైబరాబాద్ పోలీసులు కూకట్‌పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. ఫేక్ డిగ్రీలు విక్రయిస్తూ కనీసం 46 మందిని మోసగించారని, వారిలో 24 మంది ఇప్పటికే విదేశాలకు వెళ్లినట్లు తెలిసింది .

Hyderabad: కూకట్‌పల్లిలో దుకాణం.. డబ్బులిస్తే ఏ సర్టిఫికేట్స్ అయినా ఇస్తారు
Fake Certificate Scam
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Jul 26, 2025 | 7:54 PM

Share

సైబరాబాద్ పోలీసులకు మరో భారీ నకిలీ సర్టిఫికెట్ ముఠాకు చెక్ పెట్టారు. విదేశాల్లో ఉద్యోగాలు, హైయ్యర్ స్టడీస్ చేయాలని ఆశపడుతున్న అభ్యర్థులను లక్ష్యంగా చేసుకున్న ఓ నకిలీ సర్టిఫికెట్ ముఠా కుకట్‌పల్లిలో దుకాణం తెరిచింది. శ్రీ వ్యాస్ కన్సల్టెన్సీ పేరుతో కార్యకలాపాలకు తెరలేపారు. వీరు యువతీయువకుల డబ్బలు కాజేస్తూ నకిలీ సర్టిఫికేట్స్ అంజేస్తున్నారు. సమాచారం అందడంతో పోలీసులు సోదాలు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు.

ఈ ముఠాలో ప్రధాన నిందితులుగా భావిస్తున్న A.హరీష్, M.మహేష్ అనే ఇద్దరు వ్యక్తులు కుకట్‌పల్లిలోని శ్రీ వ్యాస్ కన్సల్టెన్సీ పేరుతో కార్యాలయం నిర్వహిస్తూ, విదేశీ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులకు నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు, మార్కుల పట్టాలు అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కూకట్‌పల్లిలో ఈ కేంద్రంలో సోదాలు నిర్వహించగా.. అనేక నకిలీ సర్టిఫికెట్లు, మొబైల్ ఫోన్లు, కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇప్పటివరకు కనీసం 46 మందికి నకిలీ సర్టిఫేక్స్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో 24 మంది ఇప్పటికే ఆ పత్రాలతో విదేశాలకు వెళ్లిపోయినట్లు కూడా విచారణలో వెల్లడైంది.

మరింత విచారణలో నిందితులు ఈ నకిలీ సర్టిఫికెట్లు విజయవాడకు చెందిన మోహన్ అనే వ్యక్తి ద్వారా పొందుతున్నట్లు కూడా పోలీసులకు సమాచారం లభించింది. మోహన్‌ కోసం గాలింపు జరుగుతుంది ఈ స్కామ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ముఠా నెట్‌వర్క్‌పై ఫోకస్ పెట్టారు. యువతను మోసం చేస్తూ, విదేశాల్లో భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టే ఇలాంటి ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..