నషా ముక్త్ భారత్‌ మన లక్ష్యం.. కిషన్ రెడ్డి పాదయాత్రకు చిరంజీవి మద్దతు.. లైవ్ వీడియో
Kishan Reddy Nasha Mukt Bharat Yatra

నషా ముక్త్ భారత్‌ మన లక్ష్యం.. కిషన్ రెడ్డి పాదయాత్రకు చిరంజీవి మద్దతు.. లైవ్ వీడియో

Updated on: Nov 26, 2026 | 9:51 AM

దేశంలో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టి, యువతను మాదకద్రవ్యాల బారి నుంచి కాపాడేందుకు చేపట్టిన నషా ముక్త్ భారత్ యాత్రకు మెగాస్టార్ చిరంజీవి మద్దతు ప్రకటించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నిర్వహిస్తున్న ఈ పాదయాత్రలో యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 2029 నాటికి డ్రగ్స్ రహిత భారత్ నిర్మించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.

నషా ముక్త్ భారత్‌ మన లక్ష్యం.. యువతను మత్తు నుంచి బయటపడేద్దాం.. అనే నినాదం వినిపిస్తోంది దేశంలో. .2029 నాటికి డ్రగ్ ఫ్రీ ఇండియా నిర్మాణమే టార్గెట్‌గా కేంద్రసర్కార్ సంకల్పించింది. డ్రగ్స్‌ రహిత సమాజం కోసం.. ప్రధాని మోదీ పిలుపునకు అనుగుణంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో నషా ముక్త్ భారత్ పాదయాత్ర చేపట్టారు. బుధవారం ప్రారంభమైన యాత్ర.. ఇవాళ రెండోరోజు కొనసాగుతోంది.. రేపు మూడో రోజు జూబ్లీహిల్స్‌లో పాదయాత్ర ముగుస్తుంది. రెండో రోజు పాదయాత్ర ముషీరాబాద్ నుంచి అమీర్‌పేట్ వైపు కొనసాగుతోంది. మాదకద్రవ్యాల (డ్రగ్స్) వినియోగంపై యువత, విద్యార్థుల్లో అవగాహన కల్పించి, 2029 నాటికి డ్రగ్స్ రహిత భారత్‌గా మార్చడం లక్ష్యంగా కిషన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు..

నషా ముక్త్‌ భారత్‌ పోరాటానికి సినీ నటుడు చిరంజీవి మద్దతు ప్రకటించారు. యువతను నాశనం చేస్తున్న డ్రగ్స్‌ మహమ్మారిని తరిమికొట్టాలన్నారు. కిషన్‌రెడ్డి నిర్వహిస్తు్‌న్న నషా ముక్త్‌ భారత్‌ యాత్రలో పాల్గొనాలన్నారు. ఈ ఉద్యమంలో యూత్‌ అంతా భాగస్వామ్యం కావాలన్నారు చిరంజీవి.

Loading...
Unable to load recommendations.
Follow Us