Hyderabad: శవానికి ఉండాల్సిన దుస్తులు సమాధి పక్కన.. అక్కడే ఓ కుందేలు..

| Edited By: Ram Naramaneni

Sep 04, 2024 | 9:48 PM

సహజంగా మనుషుల శవ సంస్కారాలు చేసే స్మశానాలకు వెళ్లాలంటేనే చాలామంది భయపడతారు. ఈ మధ్య.. స్మశానాల్లో తాంత్రిక పూజలు చేసేవారు కూడా ఎక్కువవ్వడంతో ఆ ప్రాంతాలకు సమీపంలో నివశించేవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Hyderabad: శవానికి ఉండాల్సిన దుస్తులు సమాధి పక్కన.. అక్కడే ఓ కుందేలు..
Burial Ground
Follow us on

హైదరాబాద్ మహా నగరంలోని స్మశానాల్లో భయానక దృశ్యాలు కనపడుతున్నాయి. మామూలుగా స్మశానం అన్నా, ఆ పరిసర ప్రాంతాలన్నా కొంచెం భయంగానే ఉంటుంది ఎవరికైనా. వీలైనంత వరకు ఆ వైపు కూడా వెళ్లడానికి ఆలోచిస్తాం. అసలే స్మశానం భయానకం అనుకుంటే.. ఇప్పుడు దానికి మరో భయం తోడు అయింది. స్మశానాల్లో మంత్రాలు చేస్తుంటారని గతంలో చాలా సందర్భాల్లో విన్నాం. మంత్రగాళ్లు రాత్రిపూట ఎక్కువగా అక్కడే సంచరిస్తుంటారని కూడా ఎన్నో ఘటనలు చూశాం. ఇప్పుడు హైదరాబాద్ నగరంలోని కొన్ని స్మశానాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది.

స్మశానాల్లో మంత్రాలు చేస్తున్నారని గతంలో అనేక సందర్భాల్లో ఆధారాలు దొరికినప్పటికీ.. వారి ఆచూకి మాత్రం దొరకలేదు. దీంతో స్మశానం పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఏం చేయాలో తెలియక భయంతో బతకాల్సిన పరిస్థితి. తాజాగా పాతబస్తీ ఏరియాలోని స్మశానంలో భయం పుట్టించే సీన్స్ కనిపించాయి. పాతి పెట్టేటప్పుడు శవంపైన చుట్టే దుస్తులు బయట పడి ఉండడంతో ప్రజలు తీవ్ర భయాందోళన గురవుతున్నారు. తెల్లని రంగు బట్టలు సమాధుల పక్కన పడి ఉండటాన్ని గమనించిన కొందరు.. ఇది మాంత్రికులు పనే అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆ సమాధి చుట్టూ ఓ కుందేలు తిరుగుతూ కనిపించింది. దీంతో దాన్ని కూడా తాంత్రిక పూజల కోసం అక్కడికి తీసుకువచ్చారా అని అక్కడివారు ఆందోళనకు గురవుతున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..