AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“నేను ముసలోడిని అయిపోయాను.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు”

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానో లేదో తెలియదని, అసలు పోటీ చేయాలనే ఆలోచన కూడా లేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు పాతబస్తీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. విద్యార్థులతో జరిగిన కార్యక్రమంలో తన రాజకీయ ప్రస్థానం, విద్యాభ్యాసం గురించి మాట్లాడిన ఆయన.. తాను 12వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నప్పటికీ ముఖ్యమంత్రి సమాధానం చెప్పే స్థాయికి ఎదిగానని వ్యాఖ్యానించారు.

“నేను ముసలోడిని అయిపోయాను.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు”
Akbaruddin Owaisi
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Oct 03, 2026 | 12:56 PM

Share

హైదరాబాద్ పాతబస్తీ రాజకీయాల్లో కీలకంగా ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానో లేదో తెలియదని, అసలు పోటీ చేయాలనే ఆలోచన కూడా లేదని అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. పాతబస్తీలోని తన ఎడ్యుకేషన్ క్యాంపస్‌లో విద్యార్థులతో జరిగిన కార్యక్రమంలో అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రస్థానం, తాను ఎదిగిన తీరు గురించి విద్యార్థులతో పలు విషయాలను పంచుకున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో తన పోటీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

“నేను ముసలోడిని అయిపోయాను.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు. పోటీ చేయాలని ఆలోచన కూడా లేదు.. చేయను” అంటూ అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

అక్బరుద్దీన్ ఓవైసీ మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా విద్యార్థులతో పంచుకున్నారు. తాను కేవలం 12వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని చెప్పారు. అయితే చదువు అక్కడితో ఆగిపోయినా.. రాజకీయంగా తాను ఎదిగిన స్థాయిని ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

“నేను 12వ తరగతి చదువుకున్నాను.. కానీ నేను ఏం చెప్పినా దానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పే స్థాయికి ఎదిగాను” అంటూ అక్బరుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. విద్యార్థులతో జరిగిన కార్యక్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యపైనే ఇప్పుడు ఆసక్తి నెలకొంది. పాతబస్తీ రాజకీయాల్లో అక్బరుద్దీన్ ఓవైసీకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలో ఆయన ఎన్నికలకు దూరంగా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రత్యామ్నాయంగా ఎవరు బరిలోకి దిగుతారు? అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.

అయితే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆయన స్వయంగా చేసిన ప్రకటన మాత్రమే. ఎన్నికల సమయంలో ఆయన తుది నిర్ణయం ఏమిటన్నది భవిష్యత్తులో స్పష్టమయ్యే అవకాశం ఉంది. కానీ ఎన్నికల్లో పోటీ చేయడం గురించి ఇప్పుడే చేయను అంటూ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం పాతబస్తీ రాజకీయాల్లో ఆసక్తిని పెంచాయి.

ఒకవైపు తన వయస్సును ప్రస్తావిస్తూ ఎన్నికల్లో పోటీపై సందేహం వ్యక్తం చేయడం.. మరోవైపు తాను 12వ తరగతి వరకు చదివినా ముఖ్యమంత్రి సమాధానం చెప్పే స్థాయికి ఎదిగానని చెప్పడం.. ఇలా ఒకే కార్యక్రమంలో అక్బరుద్దీన్ చేసిన రెండు కీలక వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ చర్చకు కారణమయ్యాయి.

అసలు అక్బరుద్దీన్ ఓవైసీ వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటారా? లేక ఆయన చెప్పినట్టుగానే ఎన్నికలకు దూరంగా ఉంటారా? ఆయన స్థానంలో కొత్త ముఖానికి అవకాశం వస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. అక్బరుద్దీన్ చేసిన తాజా వ్యాఖ్యలు మాత్రం పాతబస్తీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి.

Follow Us
రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన లేదు: అక్బరుద్దీన్ ఓవైసీ
రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన లేదు: అక్బరుద్దీన్ ఓవైసీ
స్పైసీ మటన్ కర్రీ.. ఇలా వండితే ముద్దకూడా మిగలదు అంతే
స్పైసీ మటన్ కర్రీ.. ఇలా వండితే ముద్దకూడా మిగలదు అంతే
పైలట్ స్మిత్ మచ్చార్ కుటుంబానికి భారీ నజరానా..!
పైలట్ స్మిత్ మచ్చార్ కుటుంబానికి భారీ నజరానా..!
పిల్లనివ్వలేదనీ మేనమామల ఇళ్లకు కన్నం.. ఆ తర్వాత సీన్‌ ఇదే!
పిల్లనివ్వలేదనీ మేనమామల ఇళ్లకు కన్నం.. ఆ తర్వాత సీన్‌ ఇదే!
చిరంజీవి, వెంకటేష్‌లతో కనిపించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా.?
చిరంజీవి, వెంకటేష్‌లతో కనిపించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా.?
నవరాత్రి ఉపవాసం వెనుక నిజమైన కారణం ఇదే: సద్గురు ఏం చెప్పారంటే?
నవరాత్రి ఉపవాసం వెనుక నిజమైన కారణం ఇదే: సద్గురు ఏం చెప్పారంటే?
అర్ధరాత్రి హైవేపై అందమైన యువతి... ప్యార్ ఆ గయా రే అంటూ రచ్చ..!
అర్ధరాత్రి హైవేపై అందమైన యువతి... ప్యార్ ఆ గయా రే అంటూ రచ్చ..!
సక్సెస్ కావాలంటే కష్టాల నుంచి పారిపోకండి.. ఓ తాత చెప్పిన కథ!
సక్సెస్ కావాలంటే కష్టాల నుంచి పారిపోకండి.. ఓ తాత చెప్పిన కథ!
యువతిపై కత్తితో దాడి.. భవనం పైనుంచి దూకిన ప్రియుడు!
యువతిపై కత్తితో దాడి.. భవనం పైనుంచి దూకిన ప్రియుడు!
వెంకటేష్‌కు కూతురిగా ప్రేయసిగా నటించిన ఏకైక హీరోయిన్..
వెంకటేష్‌కు కూతురిగా ప్రేయసిగా నటించిన ఏకైక హీరోయిన్..