Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న ఏడుగురు కార్మికులు మృతి
హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బజార్‌ఘాట్‌లోని కెమికల్ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. నాలుగు అంతస్తుల వరకు వ్యాపించాయి మంటలు. మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. రంగంలోకి దిగిన అగ్నిమాకప సిబ్బంది.. మూడు ఫైరింజిన్లతో మంటలను ఆర్పేశారు.
హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బజార్‌ఘాట్‌లోని కెమికల్ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. నాలుగు అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. రంగంలోకి దిగిన అగ్నిమాకప సిబ్బంది.. మూడు ఫైరింజిన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. రాకాశి మంటల్లో చిక్కుకొని ఏడుగురు కార్మికులు చనిపోయినట్లు ప్రాధమికంగా గుర్తించారు. ఇందులో ఇద్దరు మహిళలు ఉన్నట్లు చెబుతున్నారు. ఫైరింజిన్లతో మంటలు ఆర్పుతున్నప్పటికీ అదుపులోకి రాని ఆగ్నికీలలు. ఇక్కడి పరిస్థితిపై దర్యాప్తు చేపట్టారు పోలీసు అధికారులు. కమర్షియల్ కం రెసిడెన్సియల్ బిల్డింగ్‌గా గుర్తించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో కార్ గ్యారేజ్ వద్ద ఉన్న డీజిల్ డ్రమ్ములు పేలి భారీగా మంటలకు కారణం అయింది. సర్వీసింగ్‌కి వచ్చిన కార్లలోని డీజిల్‌ను డ్రమ్ముల్లో నిలువ ఉంచడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
గ్రౌండ్ ఫ్లోర్లో కంటే కూడా రెసిడెన్సియల్ ప్లేస్‌లో మంటలు క్షణాల వ్యవధిలో వ్యాపించినట్లు డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. మొదటి అంతస్తులో కొన్ని కుటుంబాలు చిన్న పిల్లలతో నివాసముంటున్నారు. వీరికి ఊపిరి ఆడక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఇద్దరికి గాయాలు కాగా..ఆరుగురు మరణించినట్లు ప్రాధమికంగా గుర్తించారు. మరిన్ని వివరాలు దర్యాప్తులో వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు. రెస్క్యూ సిబ్బందిని లోనికి పంపించి మొదటి అంతస్తులోని కొందరిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. మంటలు అదుపులోకి వస్తే పరిస్థితిని అంచనా వేసేందుకు అవకాశం ఉండంటున్నారు లోకల్ డీసీపీ. బిల్డింగ్ పర్మిషన్లపై కూడా ఓనర్లను సంప్రదించి చర్యలు చేపడతామంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..