Hyderabad: మీ ఇంట్లో దెయ్యాలు ఉంటే వీళ్లు కనిపెట్టేస్తారు.. ఆ తర్వాత

|

Sep 06, 2024 | 2:52 PM

ఇంట్లో ఆత్మ తిరుగుతోందని చెబుతారు. దోష నివారణ పూజలు చేయాలని.. లేకుంటే అందరూ టపా కట్టేస్తారని వసూళ్లకు పాల్పడతారు. ఇలా ఓ కుటుంబం నుంచి 30 లక్షలు కొల్లగొట్టారు.. చివరికి...

Hyderabad: మీ ఇంట్లో దెయ్యాలు ఉంటే వీళ్లు కనిపెట్టేస్తారు.. ఆ తర్వాత
Extortion Batch
Follow us on

ఆత్మలు ఉన్నాయా..? ఎవరికైనా కనిపించాయా..? చాలామంది తమకు ఆత్మలు కనిపించాయని చెబుతారు. అదంతా ట్రాస్ అంటారు జనవిజ్ఞాన వేదిక వాళ్లు. దెయ్యాలు ఉన్నాయి అనడానికి సైంటిఫిక్ ఆధారాలు ఏం లేవని కొట్టి పారేస్తుంటారు. అయితే సొసైటీలో మాత్రం ఆత్మలు, దెయ్యాలు ఉన్నాయి అన్న నమ్మకం బలంగా ఉంది. ఆ వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. పైన మీరు ఫోటోల్లో చూస్తోన్న బ్యాచ్ అలాంటిందే. మీ ఇంట్లో ఆత్మ తిరుగుతోందని.. దాన్ని తరిమికొట్టేందుకు పూజలు చేయాలని చెబుతారు. లేకుంటే.. ఇంట్లో నివశిస్తున్న అందరూ చనిపోతారని భయపెడతారు. ఇలానే మోసానికి పాల్పడి.. ఓ కుటుంబం నుంచి 30 లక్షలు కాజేశారు. ఈ ఘటన సికింద్రాబాద్‌లోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని.. రూ.20 లక్షలు రికవరీ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూబోయిగూడకు చెందిన జయనందిని తల్లి జయకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. సోషల్ మీడియాలో పూజలతో సమస్యలు తీరుతాయనే అడ్వర్టైజ్‌మెంట్ చూసి.. ఆ నంబర్లకు సంప్రదించారు. ఈ పూజల బ్యాచ్‌లోని సభ్యులు పురాణం నివాస్, ఎర్నాల వాసు, కిన్నెరసాయి, నాగరాజులు మీ ఇంట్లో ఆత్మ తిరుగుతుందని, దాన్ని తరిమికొట్టేందుకు పూజలు చేయాలని.. భయపెట్టారు. లేకుంటే అందరూ చనిపోతారంటూ హడలగొట్టారు. అలా ఆగస్టు 17 నుంచి రూ.30 లక్షలు కాజేశారు. జయ ఆరోగ్యం మెరుగవ్వపోవడంతో.. మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీరు కూడా ఇలా తాంత్రిక పూజలు చేసే వ్యక్తుల్ని.. దెయ్యాలు, భూతాలు వదిలిస్తామనే బ్యాచులను నమ్మితే మోసపోవడం ఖాయం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..