హైదరాబాద్‌ ఓటర్లకు తీపికబురు.. నగరంలో 16 ప్రత్యేక SIR హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు

నగరంలోని లోని అన్ని ఈఆర్‌వో కార్యాలయాల్లో ఓటర్లు, పౌరులకు ప్రత్యేక సహాయం అందించేందుకు 16 హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. ఈ హెల్ప్‌డెస్క్‌ల ద్వారా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు సంబంధించిన వివరాలు, ఎన్యూమరేషన్ ఫారం పూరించే విధానం, అలాగే తమ ప్రాంతానికి చెందిన ఈఆర్‌వో, ఏఈఆర్‌వో, బీఎల్‌వో వివరాలను తెలుసుకునే అవకాశం కల్పించారు. ఓటర్లకు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించడం, సందేహాలను నివృత్తి చేయడం ఈ కేంద్రాల ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు..

హైదరాబాద్‌ ఓటర్లకు తీపికబురు.. నగరంలో 16 ప్రత్యేక SIR హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు
Hyderabad SIR Voter Help Desks

Updated on: Jul 03, 2026 | 6:33 PM

హైదరాబాద్, జులై 3: హైదరాబాద్ జిల్లాలోని అన్ని ఈఆర్‌వో (ERO) కార్యాలయాలలో ఓటర్లు/పౌరులకు ప్రత్యేక సహాయం అందించేందుకు మొత్తం 16 హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతి హెల్ప్ డెస్క్‌కు ఒక ఇన్‌చార్జిని నియమించారు. ఈ హెల్ప్ డెస్క్‌ల ద్వారా ఓటర్లు/పౌరులు SIR (Special Intensive Revision) ప్రక్రియలో చేయవలసినవి, చేయకూడనివి (Do’s & Don’ts), ఎన్యూమరేషన్ ఫారాన్ని ఎలా పూరించాలి? తమ ఇంటికి సంబంధించిన ERO, AERO, BLO వివరాలను ఎలా తెలుసుకోవాలి? వంటి విషయాలను తెలుసుకోవచ్చు.

నియోజకవర్గాల వారీగా హెల్ప్ డెస్క్‌ల వివరాలు ఇవే..

  • 57 – ముషీరాబాద్: మున్సిపల్ కార్యాలయం, దోమలగూడ.
  • 58 – మలక్‌పేట్: మున్సిపల్ కార్యాలయం, ప్రభుత్వ క్వార్టర్స్, బ్లాక్–B, 2, 4 & 5.
  • 59 – అంబర్‌పేట్: మున్సిపల్ కార్యాలయం, 6వ అంతస్తు, అబిడ్స్ పార్కింగ్ కాంప్లెక్స్.
  • 60 – ఖైరతాబాద్: మున్సిపల్ కార్యాలయం, 1వ అంతస్తు, ఖైరతాబాద్.
  • 61 – జూబ్లీహిల్స్: మున్సిపల్ కార్యాలయం, యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్.
  • 62 – సనత్‌నగర్: మున్సిపల్ కార్యాలయం, హరిహర కళాభవన్.
  • 63 – నాంపల్లి: మున్సిపల్ కార్యాలయం, సాయిబాబా దేవాలయం ఎదురుగా, గుడిమల్కాపూర్.
  • 64 – కార్వాన్: మున్సిపల్ కార్యాలయం, 2వ అంతస్తు, ఖైరతాబాద్.
  • 65 – గోషామహల్: మున్సిపల్ కార్యాలయం, 4వ అంతస్తు, అబిడ్స్ పార్కింగ్ కాంప్లెక్స్.
  • 66 – చార్మినార్: మున్సిపల్ కార్యాలయం, మొఘల్‌పురా.
  • 67 – చాంద్రాయణగుట్ట: మున్సిపల్ కార్యాలయం, జంగమెట్.
  • 68 – యాకుత్‌పురా: మున్సిపల్ కార్యాలయం, ఫూల్‌బాగ్.
  • 69 – బహదూర్‌పురా: మున్సిపల్ కార్యాలయం, ఫూల్‌బాగ్.
  • 70 – సికింద్రాబాద్: మున్సిపల్ కార్యాలయం, సికింద్రాబాద్ కోర్టు పక్కన.
  • 71 – కంటోన్మెంట్: సీఈఓ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం.
  • జిల్లా ఎన్నికల అధికారి & కమిషనర్, జీహెచ్‌ఎంసీ కార్యాలయం: ట్యాంక్‌బండ్.
Follow Us