AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తండ్రి వెంట వ్యవసాయ పనులకు వచ్చిన బాలిక.. కన్నేసి కాటేసిన యజమాని..!

పని కోసం వచ్చిన మైనర్ బాలికపై ఓ కామాంధుడు కన్నేశాడు. మైనర్ బాలికను బెదిరించి పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఎవరికైనా చెప్తే చంపుతానని బెదిరించాడు. దీంతో భయపడిన ఆ బాలిక ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచి పెట్టింది.

Telangana: తండ్రి వెంట వ్యవసాయ పనులకు వచ్చిన బాలిక.. కన్నేసి కాటేసిన యజమాని..!
Crime News
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Aug 14, 2024 | 11:19 AM

Share

పని కోసం వచ్చిన మైనర్ బాలికపై ఓ కామాంధుడు కన్నేశాడు. మైనర్ బాలికను బెదిరించి పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఎవరికైనా చెప్తే చంపుతానని బెదిరించాడు. దీంతో భయపడిన ఆ బాలిక ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచి పెట్టింది. దీంతో తన శరీరంలో వచ్చిన మార్పులు గమనించిన తల్లిదండ్రులు బాలికను నిలదీశారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. అప్పటికే ఐదు నెలల గర్భం దాల్చింది బాలిక. దీంతో కంగుతిన్న తల్లిదండ్రులు ఆ కామాంధుడిపై శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తన తండ్రితో కలిసి పనికి వెళ్లిన గిరిజన బాలికపై ఓ కామాంధుడు కన్నేశాడు. బెదిరించి మరీ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. దాదాపు 5 నెలలు గడిచిన తర్వాత ఈ విషయం బయటకు తెలియడంతో బాలిక కుటుంబ సభ్యులను బెదిరించి బాలికకు అబార్షన్ చేయించాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు డబ్బుకు లొంగక పోలీసులను ఆశ్రయించారు. శంషాబాద్ మండలంలోని ఓ తండాకు చెందిన బాలిక తన తండ్రితో సమీప గ్రామంలో పలుకుబడి ఉన్న ఓ వ్యక్తి భూమిలో వ్యవసాయ పనులకు వెళ్తోంది. ఆమెపై కన్నేసిన యజమాని అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

అతడికి భయపడిన బాలిక ఇన్ని రోజులు విషయం చెప్పకపోవడంతో ఐదు నెలల గర్భం దాల్చింది. ఆ తర్వాత బాలికను యజమాని కొత్తూరుకు తీసుకువెళ్లి ప్రాణానికి ముప్పు ఉంటుందని తెలిసిన డబ్బులు ఇచ్చి మరి గర్భస్రావం చేయించాడు. అనంతరం ఈ విషయం తెలియడంతో తన వ్యవసాయ క్షేత్రంలో గ్రామ పెద్దలు తండావాసులను కూర్చోబెట్టి రాజీ ప్రయత్నం చేశారు. స్థానికంగా ఉన్న కొంతమంది జేబులో డబ్బులు నింపి, తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేశాడు. చివరికి జరిగిన ఘోరం భరించలేక తల్లిదండ్రులు శంషాబాద్ పోలీసులు ఆశ్రయించారు. జరిగిన దారుణం అంతా పోలీసులకు వివరించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ శార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
ఈ నేచురల్ చిట్కాతో.. ఒక్క రోజులోనే గోకుడు గజ్జికి జెట్ స్పీడ్‎తో
ఈ నేచురల్ చిట్కాతో.. ఒక్క రోజులోనే గోకుడు గజ్జికి జెట్ స్పీడ్‎తో
అంతరిక్ష చరిత్రలో సరికొత్త రికార్డు..!
అంతరిక్ష చరిత్రలో సరికొత్త రికార్డు..!
నెలకు రూ.3 వేల పెట్టుబడి.. మీ చేతికి రూ.1.05 కోట్లు!
నెలకు రూ.3 వేల పెట్టుబడి.. మీ చేతికి రూ.1.05 కోట్లు!
షుగర్ ఉన్నవారికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. రాగి-మెంతులతో ఇలా చేస్తే.
షుగర్ ఉన్నవారికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. రాగి-మెంతులతో ఇలా చేస్తే.
గ్రామంలోకి పెద్దపులి ఎంట్రీ.. భయంతో వణికిపోతున్న జనం!
గ్రామంలోకి పెద్దపులి ఎంట్రీ.. భయంతో వణికిపోతున్న జనం!
లాటరీ లేదు.. వేలంపాట కాదు.. సర్పంచ్ అభ్యర్థిని ఓటుతోనే తేల్చారు
లాటరీ లేదు.. వేలంపాట కాదు.. సర్పంచ్ అభ్యర్థిని ఓటుతోనే తేల్చారు
విమానాలకు వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ సవాల్..!
విమానాలకు వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ సవాల్..!
వేడి వేడి అన్నంలోకి బీరకాయ తొక్కల పచ్చడి.. రుచి అదిరిపోతుంది!
వేడి వేడి అన్నంలోకి బీరకాయ తొక్కల పచ్చడి.. రుచి అదిరిపోతుంది!
ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. ఇక బట్టీ పట్టి రాస్తే మార్కులు రావ్‌
ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. ఇక బట్టీ పట్టి రాస్తే మార్కులు రావ్‌
పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన మోహిత్ ఉల్వా ఎవరు?
పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన మోహిత్ ఉల్వా ఎవరు?