AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ప్రాణం కాపాడేందుకు ఒకటయ్యారు.! శంషాబాద్‌- సికింద్రాబాద్.. జస్ట్‌ నిమిషాల్లో అవయవాల తరలింపు..

భాగ్యనగరంలో మరోసారి ట్రాఫిక్ పోలీసులు తమ ఉదారతను చాటుకున్నారు. అత్యవసరంగా ఒక ప్రాణాన్ని కాపాడటం కోసం ట్రాఫిక్ ఆంక్షలను పక్కనపెట్టి, నిమిషాల వ్యవధిలో అవయవాలను ఆసుపత్రికి చేరవేసేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి కిమ్స్ ఆసుపత్రి వరకు సాగిన ఈ ప్రయాణం సజావుగా సాగేలా చూశారు.

Hyderabad: ప్రాణం కాపాడేందుకు ఒకటయ్యారు.! శంషాబాద్‌- సికింద్రాబాద్.. జస్ట్‌ నిమిషాల్లో అవయవాల తరలింపు..
Green Channel Organ Transport
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Apr 07, 2026 | 9:29 AM

Share

మృత్యువుతో పోరాడుతున్న ఒక రోగికి ఊపిరితిత్తుల మార్పిడి అత్యవసరమైంది. దీని కోసం దాత నుంచి సేకరించిన ఊపిరితిత్తులను విమాన మార్గంలో శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి సుమారు 30 కిలోమీటర్ల దూరాన్ని అత్యంత వేగంగా దాటాల్సి ఉంది. సాధారణంగా ఈ రూట్‌లో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. ఏమాత్రం ఆలస్యమైనా అవయవం నిరుపయోగమయ్యే ప్రమాదం ఉండటంతో, ఆసుపత్రి వర్గాలు పోలీసులను ఆశ్రయించాయి. వెంటనే స్పందించిన సైబరాబాద్, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్ ప్రకటించారు.

ఎయిర్‌పోర్ట్ నుంచి ఆసుపత్రి వరకు ఉన్న అన్ని సిగ్నల్స్‌ను క్లియర్ చేశారు.అంబులెన్స్ ప్రయాణించే దారిలో ఎక్కడా వాహనాలు అడ్డురాకుండా ప్రత్యేక బృందాలను మోహరించారు. కిలోమీటర్ల దూరాన్ని కేవలం కొద్ది నిమిషాల్లోనే అంబులెన్స్ దాటేలా చేసి, సకాలంలో ఆసుపత్రికి చేర్చారు.సకాలంలో ఊపిరితిత్తులు అందడంతో వైద్యులు వెంటనే శస్త్రచికిత్స ప్రారంభించారు. ప్రాణదాత అవయవాలను క్షేమంగా చేర్చడంలో కీలక పాత్ర పోషించిన పోలీసులకు బాధితుడి కుటుంబ సభ్యులు,  నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కదిలే రైల్లో అద్భుతం..తోటి ప్రయాణికులే డాక్టర్లై పురుడు పోశారు!
కదిలే రైల్లో అద్భుతం..తోటి ప్రయాణికులే డాక్టర్లై పురుడు పోశారు!
సమ్మర్‌లో కరెంట్ బిల్లు వాచిపోతుందా..? ఈ సింపుట్‌ టిప్స్ పాటిస్తే
సమ్మర్‌లో కరెంట్ బిల్లు వాచిపోతుందా..? ఈ సింపుట్‌ టిప్స్ పాటిస్తే
పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?
పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్
అమ్మమ్మల కాలం ట్రిక్.. నోరూరించే ఊరగాయ ఇలా పెడితే అదిరిపోద్దీ
అమ్మమ్మల కాలం ట్రిక్.. నోరూరించే ఊరగాయ ఇలా పెడితే అదిరిపోద్దీ
బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే
బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే
శంషాబాద్‌- సికింద్రాబాద్.. జస్ట్‌ నిమిషాల్లో అవయవాల తరలింపు..
శంషాబాద్‌- సికింద్రాబాద్.. జస్ట్‌ నిమిషాల్లో అవయవాల తరలింపు..
ఆదర్శ వివాహం..ప్రాణాలకు తెగించిన యువతి ధైర్యానికి ప్రశంసల వెల్లువ
ఆదర్శ వివాహం..ప్రాణాలకు తెగించిన యువతి ధైర్యానికి ప్రశంసల వెల్లువ
ఇన్నాళ్లు తెలీదే.. ఎలక్ట్రిక్ కేటిల్‌తో ఇవి కూడా చేసుకోవచ్చా?
ఇన్నాళ్లు తెలీదే.. ఎలక్ట్రిక్ కేటిల్‌తో ఇవి కూడా చేసుకోవచ్చా?
ఏపీలో వీరికి రూ.15 వేల స్మార్ట్ ఫోన్ ఫ్రీ
ఏపీలో వీరికి రూ.15 వేల స్మార్ట్ ఫోన్ ఫ్రీ