Weather Alert: అలర్ట్.. తెలంగాణలో చలి పులి.. మరో రెండు రోజులు తీవ్రత.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి..

|

Feb 06, 2022 | 8:22 AM

రాష్ట్రవ్యాప్తంగా చలి చంపేస్తోంది. రోజు రోజుకీ చలి తీవ్రత మరింత పెరుగుతుంది. ఇప్పటికే గ్రామీణా ప్రాంతాల్లోనే కాకుండా

Weather Alert: అలర్ట్.. తెలంగాణలో చలి పులి.. మరో రెండు రోజులు తీవ్రత.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి..
Cold Intensity
Follow us on

రాష్ట్రవ్యాప్తంగా చలి చంపేస్తోంది. రోజు రోజుకీ చలి తీవ్రత మరింత పెరుగుతుంది. ఇప్పటికే గ్రామీణా ప్రాంతాల్లోనే కాకుండా.. పట్టణాల్లోనూ చలి ప్రభావం చూపుతుంది. రోజు రోజూ రాత్రి , పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో తెలంగాణాలోని అన్ని జిల్లాలో చలి తీవ్రత పెరుగుతుంది. ఇక ఆదివారం (ఫిబ్రవరి 6న) చలి మరింత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు, ఈశాన్య దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో చలిగాలులు వీచే అవకాశం ఉన్నట్టు పేర్కోన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా నిన్న ఆదిలాబాద్ జిల్లాలో 8.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే మెదక్ జిల్లాలో 11.5 డిగ్రీలు, రామగుండంలో 11.6 డిగ్రీలు, హన్మకొండలో 12.5 డిగ్రీలు, దుండిగల్‏లో 13.6 డిగ్రీలు, హైదరాబాద్ నగరంలో 13 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లాలో 13.7 డిగ్రీలు, హకీంపేటలో 14.7 డిగ్రీలు, భద్రచలం జిల్లాలో 15.2 డిగ్రీలు, ఖమ్మంలో 15.4 డిగ్రీలు, నల్లగొండలో 16 డిగ్రీలు రికార్డయినట్టు పేర్కోన్నారు. రాగల రెండ్రోజుల వరక కనిష్ట ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

Also Read: Prem Kumar: నీలాంబరి అంటూ వచ్చేసిన సంతోష్ శోభన్.. ప్రేమ్ కుమార్ కలల సుందరి ఎవరంటే..

Ashu Reddy: నెట్టింట్లో అషు రెడ్డి రచ్చ.. ఏకంగా ఫోన్ నంబర్ షేర్ చేసి జలక్ ఇచ్చిన బిగ్‏బాస్ బ్యూటీ.. దండం పెట్టిన నెటిజన్..

Mahesh Babu: శంకర్‌కు మహేష్‌ క్షమాపణాలు చెప్పిన వేళ.. ఆహా అన్‌స్టాపబుల్‌లో ప్రిన్స్‌ ఆసక్తికర విషయాలు..

Eesha Rebba: ఇంత హాట్‌గా ఎలా తయారయ్యావ్‌?.. ఈషా నేచురల్ ఫొటోపై యంగ్‌ హీరోయిన్‌ నాటీ కామెంట్‌..