Hyderabad: ఏం తెలివిరా సామి.. అధికారులనే షాక్‌కు గురిచేసిన గోల్డ్ స్మగ్లింగ్!

బంగారం అక్రమ రవాణా కోసం స్మగ్లర్లు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. అధికారుల కళ్లుగప్పేందుకు ఏకంగా కారులోనే రహస్య అరను ఏర్పాటు చేసి విదేశీ బంగారాన్ని తరలిస్తున్న ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. కారు టెయిల్ ల్యాంప్ వెనుక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య క్యావిటీలో దాచిన సుమారు రూ.3.83 కోట్ల విలువైన విదేశీ బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: ఏం తెలివిరా సామి.. అధికారులనే షాక్‌కు గురిచేసిన గోల్డ్ స్మగ్లింగ్!
Gold Bars Hidden

Updated on: Nov 21, 2026 | 6:57 PM

బంగారం అక్రమ రవాణా కోసం స్మగ్లర్లు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. అధికారుల కళ్లుగప్పేందుకు ఏకంగా కారులోనే రహస్య అరను ఏర్పాటు చేసి విదేశీ బంగారాన్ని తరలిస్తున్న ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. కారు టెయిల్ ల్యాంప్ వెనుక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య క్యావిటీలో దాచిన సుమారు రూ.3.83 కోట్ల విలువైన విదేశీ బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు కియా సెల్టోస్ కారులో విదేశీ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు డీఆర్‌ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కారును తనిఖీ చేశారు. ఈ క్రమంలో కారు వెనుక భాగంలోని టెయిల్ ల్యాంప్ వెనుక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య అరను గుర్తించారు. అందులో బ్రౌన్ అడెసివ్ టేప్‌తో చుట్టిన మూడు ప్యాకెట్లు బయటపడ్డాయి. వాటిని తెరిచి చూడగా 25 బంగారు బార్లు లభించాయి. వీటి మొత్తం బరువు 2.98 కిలోలుగా గుర్తించారు. అంతర్జాతీయ మార్కెట్ విలువ ప్రకారం ఈ బంగారం ధర సుమారు రూ.3.83 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

కారులో ఇంత పకడ్బందీగా రహస్య అర ఏర్పాటు చేసి బంగారం తరలించడం అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. బంగారాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఈ అక్రమ రవాణా వెనుక ఎవరున్నారు? హైదరాబాద్‌లో ఎవరికి అందించేందుకు తరలిస్తున్నారు? అనే కోణాల్లో డీఆర్‌ఐ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us