Watch Video: భారీగా పెరిగి చేపల డిమాండ్.. ఎందుకో తెలుసా.. కిలో ధర ఇలా..

| Edited By: Srikar T

Jun 08, 2024 | 12:16 PM

ఖమ్మం జిల్లాలో మృగశిర కార్తె సందర్భంగా స్థానిక ప్రజలు చేపలు కొనుగోలు చేసేందుకు బారులు తీరారు. మృగశిర కార్తె రోజు చేపలు తింటే ఆరోగ్యంగా ఉంటామని పూర్వకాలం నుండి నానుడి వినిపోస్తోంది. దీంతో స్థానిక ప్రజలు చేపలను ఎంత ఖరీదైన పెట్టి కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. మండే ఎండల నుంచి ఉపశమనం కలిగించే మృగశిర కార్తె నేటి నుండి మొదలైంది. మృగశిర కార్తెకు వ్యవసాయ పరంగానే కాక, ఆహార, ఆరోగ్య పరంగా కూడా విశేష ప్రాధాన్యం ఉంది. రోహిణి కార్తె వేళ మండే ఎండలతో సతమతమైన ప్రజలు.. తొలకరి జల్లులను మోసుకొచ్చే మృగశిర కార్తె కోసం ఎదురు చూస్తారు.

Watch Video: భారీగా పెరిగి చేపల డిమాండ్.. ఎందుకో తెలుసా.. కిలో ధర ఇలా..
Fish Market
Follow us on

ఖమ్మం జిల్లాలో మృగశిర కార్తె సందర్భంగా స్థానిక ప్రజలు చేపలు కొనుగోలు చేసేందుకు బారులు తీరారు. మృగశిర కార్తె రోజు చేపలు తింటే ఆరోగ్యంగా ఉంటామని పూర్వకాలం నుండి నానుడి వినిపోస్తోంది. దీంతో స్థానిక ప్రజలు చేపలను ఎంత ఖరీదైన పెట్టి కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. మండే ఎండల నుంచి ఉపశమనం కలిగించే మృగశిర కార్తె నేటి నుండి మొదలైంది. మృగశిర కార్తెకు వ్యవసాయ పరంగానే కాక, ఆహార, ఆరోగ్య పరంగా కూడా విశేష ప్రాధాన్యం ఉంది. రోహిణి కార్తె వేళ మండే ఎండలతో సతమతమైన ప్రజలు.. తొలకరి జల్లులను మోసుకొచ్చే మృగశిర కార్తె కోసం ఎదురు చూస్తారు. కార్తె ప్రారంభం నుంచే వానాకాలం మొదలవుతుంది. తద్వారా భూగర్భజలాల మట్టం పెరిగి నీటి సమస్య తీరుతుందని భావిస్తారు. మృగశిర కార్తెనాడు చేపలను ఆహారంగా తీసుకుంటే శ్వాస కోశ ఇబ్బందులు తొలగుతాయన్న నమ్మకం ప్రజలల్లో బలంగా నాటుకుపోయింది.

దీంతో ఖమ్మంలోని స్థానిక ప్రజలు చేపల కొనుగోళ్లకు ఆసక్తి చూపారు . బొచ్చె, బంగారు తీగ, కట్ల, శీలావతి, తదితర తెల్లచేపలకు డిమాండ్ బాగా పెరిగింది. పైగా వారాంతాలు కావడంతో వ్యాపారులు అధిక ధరలకు విక్రయింస్తున్నారు. ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడంతో స్థానికంగా ఉన్న చెరువులు, రిజర్వాయర్లు, కుంటలు, పూర్తిగా ఎండిపోయాయి. దీంతో చేపలు దొరకక ఇతర ప్రాంతాల నుండి లారీలలో, వ్యాన్లలో వ్యాపారులు చేపలను తీసుకురావల్సి వస్తోంది. అందుకే రవాణా ఛార్జీలను కలుపుకుని అధిక రేట్లకు విక్రయించామని చెబుతున్నారు. మృగశిర వేళ డిమాండును దృష్టిలో ఉంచుకొని చేపలధరలు కిలో రూ.200 నుంచి రూ.250 వరకు విక్రయిస్తున్నారు. దీంతో చేపల మార్కెట్లతోపాటు రహదారుల వెంట కొనుగోళ్ల సందడి కనిపించింది. అలాగే పలువురు ఆయుర్వేద వైద్యులు ఉబ్బస రోగులకు చేప పిల్లలను మందుగా పంపిణీ చేయడానికి సిద్ధమయ్యారు.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..