YS Sharmila: షర్మిల ఇంటి ముందు బారీకేడ్లా?.. పోలీసుల తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం..

|

Dec 14, 2022 | 4:17 PM

పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. షర్మిల వేసిన లంచ్ మోషన్‌ పిటిషన్‌ హైకోర్టు విచారణ జరిపింది. షర్మిల ఇంటి ఎదుట మీరెందుకు అంటూ ప్రశ్నించింది. ఆమె ఇంటి ముందు బారీకేడ్లు ఎందుకు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

YS Sharmila: షర్మిల ఇంటి ముందు బారీకేడ్లా?.. పోలీసుల తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం..
YS Sharmila
Follow us on

మరోసారి హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల. లంచ్ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా.. పోలీసులు అడ్డుకుంటున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. షర్మిల ఇంటి ముందు బారీకేడ్లా..? షర్మిల ఇంటి ఎదుట మీరెందుకు.. ? అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. షర్మిల పిటిషన్‌పై విచారించిన కోర్టు.. సీరియస్‌గానే రియాక్టయ్యింది. షర్మిల ఇంటి ముందు బారీకేడ్లను వెంటనే తొలగించాలని ఆదేశించింది.

షర్మిలను ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించింది హైకోర్టు. ఆమె ఇంటి ఎదుట బారీకేడ్లను తొలగించాలని చెప్పిన కోర్టు.. షర్మిలకు పలు సూచనలు కూడా చేసింది. రోడ్లపై ఎలాంటి కార్యక్రమాలను చేపట్టొద్దని సూచించింది. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించొద్దని స్పష్టం చేసింది.

ఇదిలావుంటే, కోర్టులో పిటిషన్ వేసే ముందు షర్మిలా మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పోలీసుల రాజ్యం నడుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తనను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని, ఇక్కడ పోలీస్‌ రాజ్యం నడుస్తోందని విమర్శించారు. తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని, సంక్రాంతి తర్వాత పాదయాత్ర కొనసాగిస్తానని షర్మిల పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం