AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఇద్దరిపై 20 మంది ఎటాక్.. ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు! గొడవేంటంటే..?

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ జెప్టో ఉద్యోగుల మధ్య జీతం వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. జీతం తక్కువగా వచ్చిందని ఉద్యోగి ప్రశ్నించగా వాగ్వాదం పెరిగి దాడులు జరిగాయి. అల్తాఫ్ అనే ఉద్యోగిపై ఇద్దరు దాడి చేయగా, ఆ తర్వాత అల్తాఫ్ స్నేహితులతో తిరిగి దాడి చేశాడు.

Video: ఇద్దరిపై 20 మంది ఎటాక్.. ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు! గొడవేంటంటే..?
Zepto Fight News
Sravan Kumar B
| Edited By: |

Updated on: Jun 13, 2026 | 3:38 PM

Share

హైదరాబాద్ గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జెప్టో (Zepto) ఉద్యోగుల మధ్య జీతం వివాదం ఘర్షణకు దారితీసిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులపై పలువురు కలిసి దాడి చేసినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జీతం తక్కువగా వచ్చిందని ఆరోపిస్తూ అల్తాఫ్ అనే ఉద్యోగి సంస్థలో పనిచేసే ఓ అధికారిని ప్రశ్నించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఉదయ్, వినయ్ అనే ఇద్దరు ఉద్యోగులు అల్తాఫ్‌పై దాడి చేసినట్లు సమాచారం.ఈ ఘటన తర్వాత అల్తాఫ్ తన స్నేహితులతో కలిసి తిరిగి వచ్చి ఉదయ్, వినయ్‌లపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాడి సమయంలో సుమారు 20 మంది వరకు పాల్గొన్నట్లు ప్రాథమిక సమాచారం వెలుగులోకి వచ్చింది.

దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఘర్షణకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సమాచారం అందుకున్న గుడిమల్కాపూర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.జీతం వివాదంతో ప్రారంభమైన ఈ ఘర్షణ దాడుల వరకు వెళ్లడం కలకలం రేపింది. ఘటనకు గల పూర్తి కారణాలు, దాడిలో పాల్గొన్న ఇతర వ్యక్తుల వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

వీడియో చూడండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి