Toll Collections: ఈ నేషనల్ హైవేపై.. టోల్ వసూలు నుంచి వైదొలిగిన జీఎంఆర్..

హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది జిఎంఆర్ సంస్థ. అయితే ఈ హైవేపై ఉన్న టోల్ ప్లాజాల నిర్వహణ నుండి జిఎంఆర్ సంస్థ వైదొలిగింది. నేటి నుంచి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టోల్ చార్జీలను వసూలు చేస్తోంది. ఇందుకు రెండు ఏజెన్సీలను ఏర్పాటు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 45వ నెంబర్ జాతీయ రహదారిగా పేరున్న హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి యాక్సిడెంట్లకు కేరాఫ్ అడ్రస్‎గా ఉండేది. రెండు లైన్లుగా ఉన్న ఈ హైవేను రూ.1,740 కోట్లతో బీవోటీ పద్ధతిన జీఎంఆర్ సంస్థ నాలుగు లైన్లుగా విస్తరించింది.

Toll Collections: ఈ నేషనల్ హైవేపై.. టోల్ వసూలు నుంచి వైదొలిగిన జీఎంఆర్..
Toll Charges
Follow us

| Edited By: Srikar T

Updated on: Jul 01, 2024 | 10:20 AM

హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది జిఎంఆర్ సంస్థ. అయితే ఈ హైవేపై ఉన్న టోల్ ప్లాజాల నిర్వహణ నుండి జిఎంఆర్ సంస్థ వైదొలిగింది. నేటి నుంచి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టోల్ చార్జీలను వసూలు చేస్తోంది. ఇందుకు రెండు ఏజెన్సీలను ఏర్పాటు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 45వ నెంబర్ జాతీయ రహదారిగా పేరున్న హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి యాక్సిడెంట్లకు కేరాఫ్ అడ్రస్‎గా ఉండేది. రెండు లైన్లుగా ఉన్న ఈ హైవేను రూ.1,740 కోట్లతో బీవోటీ పద్ధతిన జీఎంఆర్ సంస్థ నాలుగు లైన్లుగా విస్తరించింది. విస్తరణ సమయంలోనే ఆరు లైన్లకు సరిపడా భూసేకరణ జరిపారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు 181 కిలోమీటర్ల పొడవున రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించింది.

2012లో తెలంగాణలో పంతంగి, కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలతో టోల్ వసూలు చేస్తోంది. జీఎంఆర్‎ టోల్ వసూలుకు 2025 జూన్ వరకు గడువు ఉంది. అయితే 2024 వరకు NH65ను ఆరు లైన్లుగా విస్తరించేలా ఆ సంస్థతో ఒప్పందం కుదిరింది. తెలుగు రాష్ట్రాల విభజనతో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, ఈ నేపథ్యంలో హైవేను ఆరు లైన్లుగా విస్తరించడం కష్టమని జీఎంఆర్ కోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర విభజనతో ఇసుక లారీలు రాకపోకలు తగ్గిపోయాయని, దీంతో రోజుకు రూ.20 లక్షల చొప్పున నెలకు రూ.6 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోందని జిఎంఆర్ సంస్థ వాదించింది. ఈ నేపథ్యంలో గడువు కన్నా ముందే టోల్ వసూలు బాధ్యత నుంచి వైదొలగేందుకు జీఎంఆర్ వైదొలిగింది. దీనికి ఆ సంస్థకు నష్టపరిహారం NHAI చెల్లించనుంది.

జులై నుండి టోల్ వసూలు చేస్తున్న NHAI..

హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరణ పనులు చేపట్టే సంస్థను ఖరారు అయ్యేవరకు టోల్ వసూలు చేయాలని NHAI నిర్ణయించింది. ఇందుకు మూడు నెలలపాటు తాత్కాలిక ప్రాతిపదికన టోల్ వసూలుకు రెండు ఏజెన్సీలను NHAI ఎంపిక చేసింది. తెలంగాణలోని పంతంగి, కొర్లపహాడ్లలో టోల్ వసూలు బాధ్యతను స్కైల్యాబ్ ఇన్‎ఫ్రా, ఏపీలోని చిల్లకల్లులో కోరల్ ఇన్‎ఫ్రా సంస్థలు ఎంపిక చేసింది. NHAI ఆధ్వర్యంలో ఈ ఏజెన్సీలు నేటి నుంచి టోల్ చార్జీలను వసూలు చేస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..