Jeevan Reddy : కాంగ్రెస్‌ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా!

మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. గత కొన్ని రోజులుగా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న ఆయన ఇవాళ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖను ఆయనే స్వయంగా విడుదల చేశారు. అనుచరులతో సమావేశం అనంతరం కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్టు జీవన్ రెడ్డి ప్రకటించారు. జీవన్‌రెడ్డితో పాటు 1500 మంది కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పారు.

Jeevan Reddy : కాంగ్రెస్‌ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా!
Jeevan Reddy Resigns From Congress Party

Updated on: Mar 25, 2026 | 1:12 PM

కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్ రెడ్డి గుడ్‌బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేస్తున్న ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది తనకు ఏ గుర్తింపు లేకుండా అణగదొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు. జగిత్యాలలో తన ఉనికి ఉండకూడదని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తనక పోరాటం కొత్త కాదని.. చంద్రబాబు, కేసీఆర్‌తో పోరాడానని తెలిపారు. ఇప్పుడు సీఎం రేవంత్‌తో పోరాటానికి కూడా సిద్ధమే అని ప్రకటించారు.

అయితే రాజీనామాకు ముందు ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. తొలుత తనకు పార్టీ మారాలనే ఆలోచన లేదన్నారు జీవన్ రెడ్డి.. ఈ వయసులో పార్టీ మారి ఏం చేయగలనని చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీలో తలదూర్చకుండా చూడాలని కోరాను.. ఇదే విషయాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్‌ గౌడ్‌కు స్పష్టం చేశానని వివరించారు. కానీ అందరం కలిసి పనిచేద్దామని బుజ్జగించే ప్రయత్నం చేశారన్నారు. ఓపిక పట్టాలని కోరారని.. ఇంకా ఎంతకాలం ఓపిక పట్టాలని అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us