Chikoti Praveen: చికోటితో పాటు మరో ముగ్గురికి ఈడీ నోటీసులు.. థాయ్‌లాండ్‌ ఘటన తర్వాత యాక్షన్‌..

|

May 09, 2023 | 10:43 AM

థాయ్‌లాండ్‌ ఘటన తర్వాత ఈడీ యాక్షన్‌ మొదలు పెట్టింది. ఇటీవల థాయ్ లాండ్ లో క్యాసినో నిర్వహించిన ఘటనలో ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. చీకోటి ప్రవీణ్ తో పాటు

Chikoti Praveen: చికోటితో పాటు మరో ముగ్గురికి ఈడీ నోటీసులు.. థాయ్‌లాండ్‌ ఘటన తర్వాత యాక్షన్‌..
Chikoti Praveen
Follow us on

క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్‌కు ఈడీ ఉచ్చు బిగిస్తోంది. థాయ్‌లాండ్‌ ఘటన తర్వాత ఈడీ యాక్షన్‌ మొదలు పెట్టింది. ఇటీవల థాయ్ లాండ్ లో క్యాసినో నిర్వహించిన ఘటనలో ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. చీకోటి ప్రవీణ్ తో పాటు మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, సంపత్, మాధవరెడ్డిలకు సైతం ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 15న తమ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఫెమా నిబంధనలను ఉల్లంఘించారంటూ ఈడీ కేసు నమోదు చేసింది. అయితే ఇందులో సంపత్ ఇప్పటికే ఈడీ విచారణకు హాజరు కాగా.. మిగతా ముగ్గురు విచారణకు హాజరు కావాల్సి ఉంది. దీనితో చీకోటి ప్రవీణ్ శుక్రవారం ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశాలున్నాయి. గతంలో కూడా ప్రవీణ్ ను ఈడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.

థాయ్‌లాండ్‌లోని పటాయాలో గ్యాంబ్లింగ్‌ నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డ చికోటి ప్రవీణ్‌కు బెయిల్ ఇండియాకు తిరిగివచ్చిన సంగతి తెలిసిందే. 4500 బాట్స్ జరిమానాతో చీకోటితోపాటు 83 మందికి బెయిల్ లభించింది. ఫైన్ చెల్లించడంతో ఆ వెంటనే పోలీసులు పాస్‌పోర్టులు ఇచ్చేశారు. దాంతో చికోటి అండ్‌ గ్యాంగ్‌ హైదరాబాద్‌కి బయల్దేరింది.

థాయ్‌లాండ్‌లో బెయిల్‌ మంజూరైన తర్వాత చికోటి ప్రవీణ్ టీవీ9తో ఎక్స్‌క్లూజీవ్‌గా మాట్లాడారు. తానూ ఆర్గనైజర్‌ కాదని, తన పేరు కూడా ఎక్కడా లేదన్నారాయన. నాలుగు రోజులు పోకర్‌ టోర్నమెంట్‌ అని దేవ్‌, సీత తనకు ఆహ్వానం పంపితే ఇక్కడికి వచ్చానన్నారు.అయితే థాయ్‌లాండ్‌లో పోకర్‌ ఇల్లీగలని తనకు తెలియదన్నారు. తానూ హాల్లోకి వెళ్లిన 10 నిమిషాలకే రైడ్‌ జరిగిందని, తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకున్నానని చికోటి ప్రవీణ్‌ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం