Telangana: బరితెగించిన హెడ్ మాస్టర్.. మద్యం తాగి బడికి.. పిల్లలు ఏం చేశారో తెలుసా?

విద్యాబుద్ధులు నేర్పి.. భావి భారత పౌరులుగా తీర్చి దిద్దాల్సిన కొందరు ఉపాధ్యాయులు దారి తప్పుతున్నారు.. తాజాగా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మందు కొట్టి పాఠశాలకు హాజరయ్యాడు. ఒళ్ళు మరిచి పిల్లలపై ప్రతాపం చూపాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సదరు ఉపాధ్యాయుడికి తగిన బుద్ధి చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చెర్ల మండలం జీపీ పల్లి గ్రామంలో బుధవారం జరిగింది ఈ ఘటన.

Drunk Teacher
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Mar 28, 2024 | 10:09 AM

విద్యాబుద్ధులు నేర్పి.. భావి భారత పౌరులుగా తీర్చి దిద్దాల్సిన కొందరు ఉపాధ్యాయులు దారి తప్పుతున్నారు.. తాజాగా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మందు కొట్టి పాఠశాలకు హాజరయ్యాడు. ఒళ్ళు మరిచి పిల్లలపై ప్రతాపం చూపాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సదరు ఉపాధ్యాయుడికి తగిన బుద్ధి చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చెర్ల మండలం జీపీ పల్లి గ్రామంలో బుధవారం జరిగింది ఈ ఘటన.

చర్ల మండలం జిపి పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఇంచార్జ్ హెడ్ మాస్టర్ బానోత్ కృష్ణ విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం మార్చి 27న మద్యం సేవించి పాఠశాలకు వచ్చాడు. మద్యం మత్తులో విధులకు హాజరైన కృష్ణ విద్యార్థులను విచక్షణా రహితంగా కొట్టాడు. విద్యార్థులు భయపడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సదరు ప్రధానోపాధ్యాయుడిని పాఠశాల లోపలికి లాక్కెళ్లి ఒక గదిలో నిర్బంధించి తాళం వేశారు. అనంతరం ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.

ప్రతిరోజు పాఠశాలకు తాగి వచ్చి అక్కడ ఉన్న చెట్ల కొమ్మలను విరిచి తమను కొడుతున్నాడని విద్యార్థులు వాపోయారు. ఈ తాగుబోతు టీచర్ ఉంటే తమ పిల్లలను పాఠశాలకు పంపకూడదని తల్లిదండ్రులు ఖరాఖండిగా చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖ అధికారి విచారణ చేపట్టారు. స్కూల్ కాంప్లెక్స్ నుండి అధికారులు వస్తున్నారని తెలిసి, సమాధానం చెప్పకుండా మద్యం మత్తులో ఉన్న టీచర్ కృష్ణ అక్కడి నుండి జారుకున్నాడు. విద్యాశాఖ అధికారులు ఈ ఘటనపై నివేదిక అందించారు. దీనితో సదరు ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యా శాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

చేదు రోజులు గుర్తుచేసుకున్న బిగ్‏బాస్ కీర్తి..

అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు

రాజస్థాన్ దండయాత్రను లక్నో అడ్డుకునేనా.. రికార్డులు ఎలా ఉన్నాయంటే

పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.

నాగమణి చెంత ఉంటే అతీత శక్తులు వస్తాయా..? నిజం ఇదే...

వయసు ఒక నెంబర్ మాత్రమే.. 60 ఏళ్ల వయసులో అందాల సుందరి కిరీటం

గోధుమ రవ్వతో ఇలా ఇడ్లీలు చేయండి.. హెల్త్‌తో పాటు రుచి కూడా..

రాగి పిండితో పునుగులు ఇలా చేస్తే.. రుచితో పాటు ఆరోగ్యం కూడా!

స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.

మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..