విజృంభిస్తున్న డయేరియా, 75వేల కేసులు నమోదు

రాష్ట్రంలో ప్రభలుతున్న డయేరియా వ్యాధులు జనాన్ని భయపెడుతున్నాయి. మండుతున్న ఎండలకు వ్యాధి మరింతగా విజృంభిస్తున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. వివిధ జిల్లాల నుంచి వస్తున్న రోగులు హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో చేరుతున్నారు. గత మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 75 వేల డయేరియా కేసులు నమోదు కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వేసవిలో తాగునీటి విషయంలో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వాటర్ శాంపిల్స్‌ను తెప్పించి నాణ్యతను పరిశీస్తున్నామని హైదరాబాద్‌లోని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు స్లమ్ […]

విజృంభిస్తున్న డయేరియా, 75వేల కేసులు నమోదు
Follow us

| Edited By: Vijay K

Updated on: Mar 28, 2019 | 7:09 PM

రాష్ట్రంలో ప్రభలుతున్న డయేరియా వ్యాధులు జనాన్ని భయపెడుతున్నాయి. మండుతున్న ఎండలకు వ్యాధి మరింతగా విజృంభిస్తున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. వివిధ జిల్లాల నుంచి వస్తున్న రోగులు హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో చేరుతున్నారు. గత మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 75 వేల డయేరియా కేసులు నమోదు కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

వేసవిలో తాగునీటి విషయంలో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వాటర్ శాంపిల్స్‌ను తెప్పించి నాణ్యతను పరిశీస్తున్నామని హైదరాబాద్‌లోని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు స్లమ్ ఏరియాల్లో తాగునీటిని ఎప్పటికప్పుడు చెకప్ చేస్తున్నామని వాటర్ అనలిస్ట్‌లు చెప్పారు.

Latest Articles