Dead Frog: ఓ ప్రముఖ చపాతీ పిండి ప్యాకెట్ నుంచి బయటపడిన చచ్చిపోయిన కప్ప.. కస్టమర్ షాక్..

Dead Frog: మనిషి ఆహారం అంటే ఏమిటో తెలియనప్పుడు ఆకులు, దుంపలు వంటివి తిన్నప్పుడే ఆరోగ్యంగా బతికాడుఏమో.. కాలక్రమంలో విభిన్న రుచుల పేరుతో కడుపునిండా..

Dead Frog: ఓ ప్రముఖ చపాతీ పిండి ప్యాకెట్ నుంచి బయటపడిన చచ్చిపోయిన కప్ప.. కస్టమర్ షాక్..
Chapati Flour

Updated on: Dec 31, 2021 | 5:41 PM

Dead Frog: మనిషి ఆహారం అంటే ఏమిటో తెలియనప్పుడు ఆకులు, దుంపలు వంటివి తిన్నప్పుడే ఆరోగ్యంగా బతికాడుఏమో.. కాలక్రమంలో విభిన్న రుచుల పేరుతో కడుపునిండా తింటున్నాడు.. అయితే అంతా కల్తీ మయం. ఉదయం తినే ఆహారం నుంచి రాత్రి తినే డిన్నర్ వరకూ అన్నీ కల్తీనే.. అందుకనే త్వరగా రోగాల బారినపడుతున్నారు. ఇది సరిపోనట్లు ఇప్పుడు  కొని కంపెనీలు తమ వస్తువులను ఆహారపదార్ధాలు తయారు చేసే సమయంలో తీసుకునే నిర్లక్ష్యంతో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటి వరకూ డ్రింక్స్ బాటిల్స్ లో బల్లి, పాములు, తినే ఆహారపదార్ధంలో బొద్దింకలు వంటి వార్తల గురించి విన్నాం.. చూశాం.. తాజాగా ఓ కంపీనీకి చెందిన చపాతీ పిండి పాకెట్ లో ఏకంగా చనిపోయిన కప్పు కనిపించింది. దీంతో ఆ చపాతీ పాకెట్ కొన్న కస్టమర్ షాక్ తిన్నాడు. వివరాల్లోకి వెళ్తే..

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం రుస్తుంపేట గ్రామానికి చెందిన శివకుమార్‌ .. ఓ ప్రముఖ ఆటా కంపెనీకి చెందిన 5 కిలోల చపాతి పిండి కొనుగోలు చేశాడు.  ఈ పాకెట్ ను 10 రోజుల క్రితం నర్సాపూర్‌లోని సంగారెడ్డి రోడ్డులో గల ఓ సూపర్‌ మార్కెట్‌ లో ఖరీదు చేశాడు.  గత కొన్ని రోజులుగా పాకెట్ నుంచి పిండి తీసుకుని చపాతీలు చేసుకుని కూడా తిన్నారు. అయితే గురువారం రాత్రి.. చపాతీ తయారు చేసుకోవడానికి పిండిని ఓ గిన్నెలో వేస్తుండగా.. పిండి నుంచి ఓ చనిపోయిన కప్ప బయపడింది. ఈ విషయంపై తాను వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తానని శివ కుమార్ చెప్పారు.

 

Also Read: కొత్త సంవత్సరానికి రంగవల్లులతో స్వాగతం చెప్పండి.. సింపుల్ ఐడియాలు మీ కోసం (web story)

Follow Us