TS Corona: తెలంగాణలో కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల.. తాజాగా ఎన్ని పాజిటివ్‌ కేసులంటే..

|

Jun 16, 2022 | 8:50 PM

TS Corona:గత రెండేళ్లకుపైగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. పాజిటివ్‌ కేసులతో ఆస్పత్రులన్ని నిండిపోయాయి. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ ఆంక్షలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ..

TS Corona: తెలంగాణలో కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల.. తాజాగా ఎన్ని పాజిటివ్‌ కేసులంటే..
Follow us on

TS Corona:గత రెండేళ్లకుపైగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. పాజిటివ్‌ కేసులతో ఆస్పత్రులన్ని నిండిపోయాయి. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ ఆంక్షలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కారణంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టంది. ఇక థైర్డ్‌వేవ్‌ ముగిసి ఫోర్త్‌వేవ్‌ రాబోతోందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక దేశ వ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇక తాజాగా గురువారం హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది తెలంగాణ ఆరోగ్యశాఖ. రాష్ట్రంలో కొత్తగా 285 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఎలాంటి మరణాలు లేవు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,95,293 ఉండగా, మరణాలు 4,111 ఉన్నాయి. ఇక తాజాగా రివకరీ కేసుల సంఖ్య 65 ఉండగా, మొత్తం రికవరీ కేసుల సంఖ్య 7,89,561 ఉన్నాయి.

రాష్ట్రంలో పాజిటివిటి రేటు 0.51 శాతం ఉండగా, రివకరీ శాతం 99.28 శాతంగా ఉంది. 1621 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. రాష్ట్రంలో కొత్తగా 28,424 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇప్పటి వరకు2,52,48,268 పరీక్షలు నిర్వహంఇచినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు పెద్దగా లేకపోవడంతో ఎలాంటి ఆంక్షలు లేవు. గతంలో లాక్‌డౌన్‌ కఠినంగా ఉండగా, కేసుల సంఖ్య తగ్గిపోవడంతో విడతల వారీగా ఆంక్షలన్ని ఎత్తివేసింది ప్రభుత్వం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి