CM Revanth Reddy: ఎల్‌నినో పరిస్థితులపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక సమీక్ష

Telangana: కొవిడ్‌ తరహాలో ఎల్‌నినోపై యాక్షన్‌ ప్లాన్‌ చేపట్టాలని, ఎల్‌నినోతో తీవ్ర సంక్షభం వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. వచ్చే జూన్‌ వరకు యాక్షన్‌ ప్లాన్‌ రూపొదించాలన్నారు. తాగు, సాగునీటి సమస్యలపై..

CM Revanth Reddy: ఎల్‌నినో పరిస్థితులపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక సమీక్ష
Cm Revanth Reddy

Updated on: Oct 10, 2026 | 7:20 PM

Telangana: తెలంగాణ రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, పరిస్థితులపై జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్నతాధికారులతో ఈ సమీక్ష జరిగింది. ఈ సమీక్ష సమావేశానికి ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, ఉన్నతాధికారులు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై చర్చ జరిగింది.

కొవిడ్‌ తరహాలో ఎల్‌నినోపై యాక్షన్‌ ప్లాన్‌ చేపట్టాలని, ఎల్‌నినోతో తీవ్ర సంక్షభం వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. వచ్చే జూన్‌ వరకు యాక్షన్‌ ప్లాన్‌ రూపొదించాలన్నారు. తాగు, సాగునీటి సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్‌ సమస్య తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉందని, అందుకే ముందుస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో విద్యుత్‌ కొరత లేకుండా చర్యలు తీసుకోవాల,ఇ, విద్యుత్‌ కొనుగోలుకు ఎంత ఖర్చు అయినా సిద్ధమని అన్నారు. అందుబాటులో ఉన్న విద్యుత్‌ను పొదుపుగా వాలని సూచించారు. విద్యుత్‌ అధారిత పనులను తాత్కాలికంగా వాయిదా వేయాలని, కార్యాచరణలో ప్రజలను భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. అలాగే ఎల్‌నినోపై ప్రజలకు అవగాహన కల్పించాలని, నీటి ఎద్దడి ర ఆకుంఆడ చర్యలు చేపట్టాలని, చుక్క నీరు కూడా వృథా కాకుండా చూడాలని ఆదేశించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us