CM Revanth Reddy: ఢిల్లీలో రేవంత్ బిజీబిజీ.. రాష్ట్రాభివృద్ధిపై పలు కేంద్రమంత్రులతో కీలక భేటి

|

Jan 16, 2025 | 8:08 PM

ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్‌, కుమారస్వామితో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. రీజనల్ రింగ్ రోడ్, పర్యాటక శాఖకు సంబంధించి కొన్ని అటవీ భూముల నుంచి అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పంపించిన ప్రతిపాదనలను..

CM Revanth Reddy: ఢిల్లీలో రేవంత్ బిజీబిజీ.. రాష్ట్రాభివృద్ధిపై పలు కేంద్రమంత్రులతో కీలక భేటి
CM Revanth Reddy
Follow us on

ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్‌, కుమారస్వామితో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. రీజనల్ రింగ్ రోడ్, పర్యాటక శాఖకు సంబంధించి కొన్ని అటవీ భూముల నుంచి అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పంపించిన ప్రతిపాదనలను వెంటనే క్లియర్ చేయాలని భూపేందర్‌ యాదవ్‌ను సీఎం రేవంత్‌, మంత్రి కొండా సురేఖ కోరారు. దీనికి సానుకూలంగా స్పందించారు భూపేంద్ర యాదవ్‌. తెలంగాణలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకి అవకాశాలు, భారీ పరిశ్రమలకు సంబంధించి ప్రోత్సాహకాల కోసం కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కోరినట్టు తెలుస్తోంది.

పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్‌ బృందం విదేశాల్లో పర్యటించనుంది. ముందుగా సింగపూర్‌కి వెళ్తారు. మూడు రోజుల పాటు అక్కడ పర్యటిస్తారు. ప్రపంచ ప్రసిద్దిగాంచిన సింగపూర్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌ను సందర్శిస్తారు. నైపుణ్య అభివృద్ధికి సంబంధించిన కోర్సులు, విధానాలపై అధ్యయనం చేస్తారు. తెలంగాణలో నూతనంగా ఏర్పాటు చేసిన యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ కోసం సింగపూర్‌ ఐటీఈతో ఒప్పందం చేసుకోనున్నారు. అలాగే సింగపూర్‌ రివర్ ఫ్రంట్‌ ప్రాజెక్ట్‌ను పరిశీలిస్తారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్‌కి ఆ .. రివర్ ఫ్రంట్ అభివృద్ధి మోడల్‌ను అనుసరించేందుకు ప్రణాళికలు రూపొందించనున్నారు.

స్కిల్ యూనివర్సిటీతో భాగస్వామ్యంపై ఒప్పందాలతో పాటు పెట్టుబడులపై సింగపూర్‌ పారిశ్రామికవేత్తలతో చర్చించనుంది సీఎం బృందం. అక్కడి నుంచి ఈ నెల 20న స్విట్జర్లాండ్ వెళ్తారు. దావోస్‌లో జనవరి 20, 21, 22న జరగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొని, ప్రముఖ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతారు. గతంలో దావోస్‌, అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలతో భారీగా పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురాగలిగిన సీఎం రేవంత్‌.. ఈ పర్యటనతో తెలంగాణ ఆర్థిక ప్రగతికి మరింత ఊతం కలిగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.