CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్, మంత్రుల బృందం బిజీబిజీ.. ఈ అంశాలే అజెండాగా పర్యటన..

|

Jul 22, 2024 | 8:57 PM

అటు పాలనాపరమైన భేటీలు.. ఇటు పార్టీపరమైన భేటీలు.. మొత్తంగా ఢిల్లీ టూర్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌ బిజీబిజీగా గడిపారు. హస్తినలో ముఖ్యమంత్రి సహా మంత్రుల బృందం చాలామందితే కలిసింది. ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌ రెడ్డి.. వరుసగా కేంద్ర పెద్దలతో సమావేశమయ్యారు. కేంద్రమంత్రులను కలిసిన సీఎం రేవంత్‌ బృందం.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించారు. జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కలిసిన సీఎం రేవంత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని వివరించారు.

CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్, మంత్రుల బృందం బిజీబిజీ.. ఈ అంశాలే అజెండాగా పర్యటన..
Cm Revanth Reddy
Follow us on

అటు పాలనాపరమైన భేటీలు.. ఇటు పార్టీపరమైన భేటీలు.. మొత్తంగా ఢిల్లీ టూర్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌ బిజీబిజీగా గడిపారు. హస్తినలో ముఖ్యమంత్రి సహా మంత్రుల బృందం చాలామందితే కలిసింది. ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌ రెడ్డి.. వరుసగా కేంద్ర పెద్దలతో సమావేశమయ్యారు. కేంద్రమంత్రులను కలిసిన సీఎం రేవంత్‌ బృందం.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించారు. జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కలిసిన సీఎం రేవంత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని వివరించారు. మూసీ రివ‌ర్ ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్‌కు, జాతీయ న‌దిప‌రిరక్షణ ప్రణాళిక కింద 10 వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జ‌ల్‌జీవ‌న్ మిష‌న్ ద్వారా తెలంగాణకు నిధులు కోరిన ముఖ్యమంత్రి.. రాష్ట్రంలో పూర్తిస్థాయి తాగునీటి సరఫరాకు సహకరించాలని కోరారు.

సహచర మంత్రులతో కలిసి పెట్రోలియం మంత్రి హర్దీప్‌ సింగ్‌ను కలిసిన సీఎం రేవంత్‌.. రాష్ట్రసర్కార్‌ అమలు చేస్తున్న 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ స‌ర‌ఫ‌రా పథకానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆయిల్‌ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యాస్‌ సబ్సిడీని ముందే చెల్లించేందుకు అంగీకరించాలని కోరారు. లేదంటే, 48గంటల్లో సబ్బీడీని లబ్దిదారుల ఖాతాల్లో జమచేయాలని విన్నవించారు ముఖ్యమంత్రి రేవంత్‌. పౌరసరఫరాల శాఖకు సంబంధించిన కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయిన సీఎం రేవంత్‌ బృందం.. ధాన్యం సేక‌ర‌ణ‌, బియ్యం స‌ర‌ఫ‌రాకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు చెల్లించాలని కోరింది. పీఎం గ‌రీబ్ క‌ళ్యాణ్ యోజ‌న కింద రాష్ట్రం సరఫరా చేసిన బియ్యానికి డబ్బులివ్వాలనీ.. NFSA బియ్యానికి సంబంధించిన బ‌కాయిలు క్లియర్‌ చేయాలని విజ్ఞప్తి చేసింది.

అటు పార్టీకి సంబంధించిన కీలక భేటీల్లోనూ పాల్గొన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖర్జున్ ఖర్గేను కలిసిశారు. ఆ తరువాత అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకలతోనూ భేటీ అయ్యారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ ప్రక్రియను పార్టీ పెద్దలకు వివరించారు. వరంగల్‌లో నిర్వహించబోయే బహిరంగసభకు రావాల్సిందిగా కాంగ్రెస్ కీలక నేత ఎంపీ రాహుల్‌ను ఆహ్వానించారు. పీసీసీకి కొత్త అధ్యక్షుడి ఎంపికపైనా చర్చించినట్టు తెలుస్తోంది. ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్టు.. అటు పార్టీ అంశాలు, పాలనాపరమైన అంశాలే అజెండాగా ముఖ్యమంత్రి, మంత్రుల బృందం ఢిల్లీ పర్యటనలో వరుస భేటీలు నిర్వహించింది. మరి, ఈ భేటీల ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..