Dalit Bandhu: దళిత బంధు లబ్ధిదారులకు గుడ్‌న్యూస్‌.. వారందరికీ లబ్ధిచేకూరేలా భారీగా నిధుల కేటాయింపు

|

Nov 29, 2022 | 12:49 PM

ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలోనే దాదాపు 15,402 దళిత కుటుంబాలు ఈ పథకంతో లబ్ధి పొందాయి. మధిర, తుంగతుర్తి, అచ్చంపేట, జుక్కల్ నియోజకవర్గాల్లోని వేలాదిమంది కూడా ఈ పథకంతో లబ్ధి పొందారు.

Dalit Bandhu: దళిత బంధు లబ్ధిదారులకు గుడ్‌న్యూస్‌.. వారందరికీ లబ్ధిచేకూరేలా భారీగా నిధుల కేటాయింపు
Dalit Bandhu Scheme
Follow us on

దళితుల సామాజిక ఆర్థిక సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పథకం దళిత బంధు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఏడాది జూలైలో సీఎం కేసీఆర్‌ ప్రయోగాత్మకంగా ఈ సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని సంతృప్త పద్ధతిలో అమలుచేయడంతో ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలోనే దాదాపు 15,402 దళిత కుటుంబాలు లబ్ధి పొందాయి. ఆ తర్వాత మధిర, తుంగతుర్తి, అచ్చంపేట, జుక్కల్ నియోజకవర్గాల్లో కూడా వేలాదిమంది ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. ఈ ఏడాది నవంబర్ 20 వరకు రాష్ట్రంలో 31,000కు పైగా అర్హత కలిగిన కుటుంబాలు దళితబంధు పథకం ద్వారా లబ్ధి పొందాయి. కాగా ఈ సంక్షేమ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల సంఖ్యను పెంచడంతో పాటు నిధులను కూడా భారీగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

2.82 లక్షల మందికి..

కాగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో అర్హులైన 2.82 లక్షల మంది లబ్ధిదారులకు దళిత బంధు పథకాన్ని వర్తింపజేయనుంది ప్రభుత్వం. ఈ పథకం అమలుకు 2021-22లో రూ.3,100 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది ఏకంగా రూ.17,700 కోట్లను కేటాయించింది. ఈ పథకం కింద, అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి బ్యాంకు లింకేజీ లేకుండా రూ.10 లక్షలను గ్రాంట్‌గా అందజేస్తారు. లబ్ధిదారులు తమ సొంత కాళ్లపై నిలబడేందుకు, వారి జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచుకోవడానికి ఈ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..