Munugodu: ఈ నెల 31న బీజేపీ భారీ బహిరంగ సభ.. ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా..

|

Oct 26, 2022 | 11:23 AM

ప్రెసెంట్.. ఎక్కడ చూసినా మునుగోడు ఉప ఎన్నిక గురించే డిస్కషన్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో అన్ని పార్టీల నేతలు ఈ ఎన్నికను అత్యంత...

Munugodu: ఈ నెల 31న బీజేపీ భారీ బహిరంగ సభ.. ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా..
Bjp Chief Jp Nadda
Follow us on

ప్రెసెంట్.. ఎక్కడ చూసినా మునుగోడు ఉప ఎన్నిక గురించే డిస్కషన్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో అన్ని పార్టీల నేతలు ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో పోటా పోటీ ప్రచారం చేపడుతున్నారు. ఉప ఎన్నికలో గెలుపు కోసం పార్టీ ముఖ్య నేతలు కూడా బరిలోకి దిగుతున్నారు. తాజాగా.. మునుగోడు ప్రచారానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. 31 న మునుగోడులో జరిగే బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. బహిరంగ సభలో కీలక ప్రకటన ఉంటుందనే చర్చ వేగంగా వ్యాపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారం హోరెత్తుతోంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరఫున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 31న మునుగోడులో జరిగే బీజేపీ సభకు ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతున్నారంటూ ఆ పార్టీ తెలంగాణ శాఖ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

మునుగోడు ఎన్నిక అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షానే ఈ సభకు రప్పించే దిశగా చర్యలు చేపట్టారు. అయితే అమిత్ షా షెడ్యూల్ సహకరించని కారణంగా జేపీ నడ్డా వస్తున్నారు. ఇక పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో మునుగోడులో ప్రలోభాల పర్వం మొదలైంది. పోలీసుల తనిఖీల్లో కోట్ల రూపాయలు బయటపడుతున్నాయి. మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ కొనసాగనుందనే అంచనాల నేపథ్యంలో ఆ రెండు పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.

మరోవైపు.. ఈ నెల 30 న మునుగోడు ప్రచారానికి సీఎం కేసీఆర్ రానున్నారని తెలుస్తోంది. ఆ రోజు చండూరులో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత రోజే జేపీ నడ్డా రానుండటంతో మునుగోడు ఉపఎన్నికల హీట్ మరింత పెరిగే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..