Big News Big Debate: స్పీడ్‌ పెంచిన బీజేపీ.. టీఆర్‌ఎస్ టార్గెట్‌గా కొత్త అస్త్రం..

|

Jul 06, 2022 | 9:26 PM

మొత్తం 87 అంశాలపై సమాచారం కోరుతూ వివిధ ప్రభుత్వ శాఖలకు 60 దరఖాస్తులు పంపారు బండి సంజయ్. 2014 జూన్‌ 2 నుంచి 2022 జూన్‌ 2వరకు సీఎం కేసీఆర్‌ ఎన్నిరోజులు సెక్రటేరియట్‌లో విధులు నిర్వర్తించారు.

Big News Big Debate: స్పీడ్‌ పెంచిన బీజేపీ.. టీఆర్‌ఎస్ టార్గెట్‌గా కొత్త అస్త్రం..
Trs Vs Bjp
Follow us on

Big News Big Debate: జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత బీజేపీ స్పీడ్‌ పెంచింది. ఒకవైపు పార్టీ బలోపేతం కోసం ప్రయత్నిస్తూనే, మరోవైపు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ప్రజాకోర్టులో దోషిగా నిలబెట్టడమే లక్ష్యంగా పావులు కదిపారు కమలనాథులు. ఏదో తూతూమంత్రంగా ఆరోపణలు చేయడం కాదు, ఆధారాలతో కార్నర్‌ చేయాలని డిసైడయ్యారు. అందుకు, ఆర్టీఐ అస్త్రాన్ని ప్రయోగంచారు. మొత్తం 87 అంశాలపై సమాచారం కోరుతూ వివిధ ప్రభుత్వ శాఖలకు 60 దరఖాస్తులు పంపారు బండి సంజయ్. 2014 జూన్‌ 2 నుంచి 2022 జూన్‌ 2వరకు సీఎం కేసీఆర్‌ ఎన్నిరోజులు సెక్రటేరియట్‌లో విధులు నిర్వర్తించారు. ప్రగతిభవన్‌లో ఎన్ని రోజులు ఉన్నారు. ఫాంహౌస్‌లో ఎన్నాళ్లు బస చేశారు. ప్రగతి భవన్‌ నిర్మాణం నుంచి మొన్నటి మీడియా ప్రకటనల వరకు ఎంత ఖర్చు చేశారో ఇవ్వాలని కోరారు.

అలాగే, ఎన్నికల్లో, అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఇచ్చారు? ఏమేమీ అమలు చేశారో చెప్పాలంటూ ఆర్టీఐ ద్వారా వంద దరఖాస్తులను పంపారు బండి సంజయ్. గత నెల 28న ఈ అప్లికేషన్స్‌ సబ్‌మిట్‌ చేశారు. ఆర్టీఐ దరఖాస్తులపై నెల రోజుల్లోపు ప్రభుత్వం నుంచి సమాధానాలు ఇస్తే, వాటి ఆధారంగా ప్రజల్లోకి వెళ్లాలనుకుంటోంది బీజేపీ. ఇదే తరహాలో జిల్లాల్లో కూడా ఆర్టీఐ దరఖాస్తులు దాఖలు చేసి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని వ్యూహరచన చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..