Batukamma: తెలంగాణాలో బతుకమ్మకు వేళాయే.. తీరొక్క కూరగాయలతో బతుకమ్మను పేర్చి ఆడిపాడిన మహిళలు..

|

Sep 24, 2022 | 7:50 PM

కూరగాయలు అమ్ముకునే మహిళలు మాత్రం వెరైటీగా కూరగాయలతో బతుకమ్మను అందంగా అలంకరించారు. కూరగాయలనే దేవుళ్లగా భావించి ఈసారి కూరగాయలతో బతుకమ్మ పేర్చారు మహిళలు.

Batukamma: తెలంగాణాలో బతుకమ్మకు వేళాయే.. తీరొక్క కూరగాయలతో బతుకమ్మను పేర్చి ఆడిపాడిన మహిళలు..
Vegetable Batukamma
Follow us on

Batukamma: హిందూ సంప్రదాయంలో పువ్వులకు విశిష్ట స్థానం ఉంది.. భగవంతుడిని పూజించడానికి పువ్వులను ఉపయోగిస్తారు. అయితే తెలంగాణా సంస్కృతికి పట్టుగొమ్మగా ప్రపంచ ఖ్యాతిగాంచిన బతుకమ్మ పండగలో మాత్రం పువ్వులనే గౌరమ్మగా భావించి పూజిస్తారు. తెలంగాణ ఆడబడుచులు ఎంతో ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండగను వివిధ రకాల పువ్వులను అందంగా పేర్చి.. తొమ్మది రోజుల పాటు ఆడి పాడి, అత్యంత భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని పూజిస్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. అయితే పెద్దపల్లి జిల్లాలో బతుకమ్మ సంబరాలను మొదలు పెట్టారు.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో కూరగాయ మార్కెట్ బతుకమ్మ సందడి మొదలయ్యింది.  మార్కెట్ లోని కొందరు మహిళలు బతుకమ్మను పేర్చి, బతుకమ్మ ఆటలు ఆడి పాడారు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా కూరగాయల మార్కెట్లో గౌరమ్మను చేసి తీరొక్క కూరగాయలతో బతుకమ్మను పేర్చారు. మహిళలకు బతుకమ్మ అంటే బతుకు నిచ్చే తల్లి అని తీరక్క పూలతో బతుకమ్మను పేర్చడం ఆనవాయితీ.

అయితే కూరగాయలు అమ్ముకునే మహిళలు మాత్రం వెరైటీగా కూరగాయలతో బతుకమ్మను అందంగా అలంకరించారు. కూరగాయలనే దేవుళ్లగా భావించి ఈసారి కూరగాయలతో బతుకమ్మ పేర్చారు మహిళలు. వారి జీవనోపాధి ఈ కూరగాయల వృత్తే కాబట్టి కూరగాయలతో బతుకమ్మను తయారు చేశామని మహిళ వ్యాపారులు అన్నారు.

ఇవి కూడా చదవండి

Reporter: Sampath, TV9 : Telugu

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..