Muchintal: ముచ్చింతల్‌లో అంగరంగ వైభవంగా యతీంద్ర సప్తతి మహోత్సవాలు.. 5 రోజుల పాటు ఘనంగా వేడుకలు!

Muchintal: లోకకల్యాణం, ప్రపంచ శాంతి, దేశ రక్షణ లక్ష్యంగా ఈ మహోత్సవాల్లో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సమాజంలో సనాతన ధర్మ విలువలను చాటిచెప్పడంతో పాటు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించేలా కార్యక్రమాలను రూపొందించారు. మొత్తంగా ఐదు రోజుల పాటు ముచ్చింతల్‌లో భక్తి, ఆధ్యాత్మికత వెల్లివిరియనుంది..

Muchintal: ముచ్చింతల్‌లో అంగరంగ వైభవంగా యతీంద్ర సప్తతి మహోత్సవాలు.. 5 రోజుల పాటు ఘనంగా వేడుకలు!
Spiritual Festivities

Updated on: Nov 08, 2026 | 11:16 AM

Muchintal: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో యతీంద్ర సప్తతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. త్రిదండి చిన్న జీయర్ స్వామి 70వ తిరునక్షత్ర వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు దేశవిదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ మరోసారి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో యతీంద్ర సప్తతి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. త్రిదండి చిన్న జీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకుని ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు.

నవంబర్‌ 8 నుంచి 12వ తేదీ వరకు ఐదు రోజుల పాటు మహోత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి కూడా భక్తులు ముచ్చింతల్‌కు చేరుకుంటున్నారు.

నేడు 36వ జీయర్ పురస్కార ప్రదానోత్సవం:

మహోత్సవాల్లో భాగంగా ఉదయం 10:30 గంటలకు 36వ జీయర్ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలతో పాటు పలు ప్రత్యేక వేడుకలను కూడా ఏర్పాటు చేశారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు.

లోకక్షేమం, ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక కార్యక్రమాలు:

లోకకల్యాణం, ప్రపంచ శాంతి, దేశ రక్షణ లక్ష్యంగా ఈ మహోత్సవాల్లో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సమాజంలో సనాతన ధర్మ విలువలను చాటిచెప్పడంతో పాటు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించేలా కార్యక్రమాలను రూపొందించారు. మొత్తంగా ఐదు రోజుల పాటు ముచ్చింతల్‌లో భక్తి, ఆధ్యాత్మికత వెల్లివిరియనుంది. యతీంద్ర సప్తతి మహోత్సవాల నేపథ్యంలో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం భక్తులతో సందడిగా మారుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us