AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అయ్యో ఎంత పని చేశావు తల్లి… కట్టుకున్నవాడిని ఒప్పించలేక, లక్ష్యాన్ని వదులుకోలేక

కరీంనగర్ జిల్లాకు చెందిన కళ్యాణి అనే మహిళను సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్ల మల్యాల గ్రామానికి చెందిన కారు హరీష్‌తో వివాహం జరిగింది. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్న కళ్యాణి చిన్నప్పటి నుంచి చదువులో ముందు ఉంటూ తన ఎంబీఏ ని పూర్తి చేసింది. ప్రభుత్వ ఉద్యోగం చేయడమే తన లక్ష్యమని ఇప్పట్లో పెళ్లి వద్దని పేరెంట్స్‌కి నచ్చ చెబుతూ...

Telangana: అయ్యో ఎంత పని చేశావు తల్లి... కట్టుకున్నవాడిని ఒప్పించలేక, లక్ష్యాన్ని వదులుకోలేక
Representative Image
P Shivteja
| Edited By: |

Updated on: Sep 17, 2023 | 5:43 PM

Share

స్త్రీని దేవతగా భావించి, కొలిచే ఈ దేశంలో..ఇంకా చాలా చోట్ల స్త్రీల పట్ల వివక్షత మాత్రం తగ్గడం లేదు రోజుకో చోట, ప్రతి పూట స్త్రీల పై దారుణాలు జరుగుతూ ఉన్నాయి..తన సొంత కాళ్లపై నిలబడదా మనుకున్నా మహిళకి తన ఇంటి వాళ్లే యమపాశంగా మారారు..ఎన్నో కలలు కన్నా తన జీవిత భవిష్యత్తుని అత్తవారింటికి వేధింపులకు ఆ మహిళ బలైపోయింది ఆ అమ్మాయిని కన్న తల్లిదండ్రులకు శోకాని మిగిల్చి చివరికి ప్రాణాన్ని వదులుకుంది.

వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లాకు చెందిన కళ్యాణి అనే మహిళను సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్ల మల్యాల గ్రామానికి చెందిన కారు హరీష్‌తో వివాహం జరిగింది. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్న కళ్యాణి చిన్నప్పటి నుంచి చదువులో ముందు ఉంటూ తన ఎంబీఏ ని పూర్తి చేసింది. ప్రభుత్వ ఉద్యోగం చేయడమే తన లక్ష్యమని ఇప్పట్లో పెళ్లి వద్దని పేరెంట్స్‌కి నచ్చ చెబుతూ వచ్చింది కళ్యాణి. అయితే మంచి సంబంధం వచ్చింది పెళ్లి తర్వాత కూడా ఉద్యోగం చేయొచ్చని నచ్చజెప్పి కళ్యాణికి వివాహం జరిపించారు.

పెళ్లయిన తర్వాత కొన్ని రోజులు సాపిగా గడిచిన జీవితంతో అత్తగారు కూడా తన ఆశయానికి మద్దతుగా నిలుస్తారని కళ్యాణి భావించింది. ఎంబీఏ చదివినా కూడా కానిస్టేబుల్ ఉద్యోగానికి అప్లై చేసింది. అన్ని రకాల పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన కళ్యాణి శిక్షణ కోసం ఎదురు చూసింది. ఇదే తరుణంలో ఉద్యోగానికి ఎంపికైన విషయాన్ని అత్తింట్లో చెప్పగా దానికి వారు ఒప్పుకోలేదు. ఎన్నో రకాలుగా నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా కళ్యాణికి నిరాశే ఎదురైంది.

అలాగే ఈ ప్రభుత్వ ఉద్యోగం విషయంలో అత్తగారి ఇంటి నుంచి వేధింపులు సైతం ఎక్కువయ్యాయి. తన కన్న కలలను చేరులేకపోచున్నానని, తన భవిష్యత్తు ఇక్కడితో ముగిసిపోయిందని భావించి మానసిక ఒత్తిడికి గురైంది. మరోవైపు అత్తారింటి వేధింపులు భరించలేక శనివారం ఇంట్లో ఉరివేసుకొని ప్రాణాలు వదిలింది. ఈ విషయం తెలుసుకున్న కళ్యాణి తల్లిదండ్రుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. ప్రభుత్వం ఉద్యోగం చేయలనుకోవడమే నా కూతురు చేసిన పాపమా అంటూ నిలదీస్తున్నారు. కళ్యాణి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో