ఓవైపు పెరిగిన పెట్రోల్ ధరలు.. మరో వైపు పెట్రోల్ బంక్‌ల మోసాలు.. లబోదిబోమంటున్న సామాన్యులు

|

Nov 18, 2021 | 11:45 AM

పెట్రోల్ పేరు చెప్తే సామాన్యులకు నోటా మాట రావడంలేదు.. నిన్నటి వరకు నిత్యావసరాలు నింగిలో ఉండడేవి అనుకుంటే ఈ మధ్య కాలంలో పెట్రోల్ ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి.

ఓవైపు పెరిగిన పెట్రోల్ ధరలు.. మరో వైపు పెట్రోల్ బంక్‌ల మోసాలు.. లబోదిబోమంటున్న సామాన్యులు
Petrol
Follow us on

పెట్రోల్ పేరు చెప్తే సామాన్యులకు నోటా మాట రావడంలేదు.. నిన్నటి వరకు నిత్యావసరాలు నింగిలో ఉండడేవి అనుకుంటే ఈ మధ్య కాలంలో పెట్రోల్ ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలకు పైన ఉండటంతో సామాన్యులు నడకే శరణం, లేదంటే బస్సులే అభయం అంటూ ప్రయాణాలు సాగిస్తున్నారు. ఓవైపు రేట్లు మండిపోతుంటే మరో పెట్రోల్ బంక్ మోసాలు సామాన్యుల వెన్ను విరుస్తున్నాయి. తప్పక పెట్రోల్ కొట్టించుకుంటున్న వినియోగదారులదగ్గర కూడా తమ వక్ర బుద్ధి చూపిస్తున్నారు కొందరు. పెట్రోల్ ధరలు పెరిగి వాహన దారులు లబోదిబోమంటున్న వేళ… వినియోగదారులను మరింత ఆందోళనకు గురి చేస్తున్న పెట్రోల్ బంక్ లలో మోసాలు.

తాజాగా మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ఓ పెట్రోల్ బంకులో మోసానికి పాల్పడుతున్నారు. లీటర్ పెట్రోల్ కొడితే సగం కూడా రాకపోవడంతో ప్రజలు ఆందోళన చేస్తున్నారు. పెట్రోల్ బంక్  మోసాన్ని గుర్తించిన ఓ సామాన్యుడు ఇదేంటని ప్రశ్నింస్తే వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు . దాంతో ఎం చెయ్యాలో పాలుపోక అదే పెట్రోల్ లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని బాధితుడి ఆందోళన చేపట్టాడు. ఎందుకు ఇలా మోసాలు చేస్తున్నారని నిలదీసిన బాదితుడిపై పెట్రోల్ బంక్ సిబ్బంది దాడికి పాల్పడ్డట్టు తెలుస్తుంది. బంకుల్లో మోసాలపై బాధితుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mike Tyson: బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌కు భారతీయ వంటకాలు రుచి చూపించిన లైగర్ టీమ్..

Viral Video: దారి ఇవ్వనందుకు క్యాబ్‌డ్రైవర్‌ను చితక బాదిన మహిళ.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..

Petrol And Diesel Price: వాహనదారులకు ఇది నిజంగానే ఊరట.. వరుసగా 14వ రోజు స్థిరంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..