Telangana: ఎవ‌డ్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్ .. ఏకంగా చెరువులోకే..

| Edited By: Velpula Bharath Rao

Oct 18, 2024 | 7:08 PM

కారు డ్రైవింగ్ శిక్షణలో అదుపుతప్పిన కారుతో సహా ఇద్దరు వ్యక్తులు చెరువులో పడ్డారు. కుంటలో కారు మునిగిపోయిన కానీ కారులో ఉన్న వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట వద్ద విషాదం చోటుచేసుకుంది. డ్రైవింగ్ నేర్చుకునే క్రమంలో కారు స్టీరింగ్ అదుపుతప్పింది. కారుతో సహా డ్రైవింగ్ నేర్చుకునే వ్యక్తులు కుంటలో పడి పోయారు.వారిని స్థానికులు కాపాడారు.

Telangana: ఎవ‌డ్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్ .. ఏకంగా చెరువులోకే..
Car Fell Into Pond
Follow us on

కారు డ్రైవింగ్ శిక్షణలో అదుపుతప్పిన కారుతో సహా ఇద్దరు వ్యక్తులు చెరువులో పడ్డారు. కుంటలో కారు మునిగిపోయిన కానీ కారులో ఉన్న వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట వద్ద విషాదం చోటుచేసుకుంది. డ్రైవింగ్ నేర్చుకునే క్రమంలో కారు స్టీరింగ్ అదుపుతప్పింది. కారుతో సహా డ్రైవింగ్ నేర్చుకునే వ్యక్తులు కుంటలో పడి పోయారు.వారిని స్థానికులు కాపాడారు.

కానీ కారు మాత్రం కుంటలో మునిగిపోయింది. గోరేమియా అనే వ్యక్తి బతుకమ్మ కుంట గ్రౌండ్లో కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు.. ఈ క్రమంలో ఒక్కసారిగా కారు అదుపుతప్పి అతివేగంగా వెళ్లి పక్కనే ఉన్న బతుకమ్మ కుంటలో పడింది.కుంటలో లోతు ఎక్కువ ఉండడంతో కార్ అందులో మునిగిపోయింది.గమనించిన స్థానికులు వారిని కాపాడారు. నిత్యం వాకర్స్, క్రీడాకారులతో రద్దీగా ఉండే బతుకమ్మ కుంట మైదానంలో ఇలాంటి డ్రైవింగ్ శిక్షణకు అనుమతి ఇవ్వడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని వాకర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వీడియో ఇదిగో:

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి