Cm Kcr Press Meet: ఎన్డీయే పాలనలో లక్షల కోట్ల కుంభకోణాలు.. షాకింగ్ ఆరోపణలు చేసిన సీఎం కేసీఆర్..

|

Aug 06, 2022 | 5:42 PM

Cm Kcr Press Meet: గతంలో ఏ ప్రభుత్వంలోనూ జరుగని కుంభకోణాలు ఎన్డీయే ప్రభుత్వ హయాంలో జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్..

Cm Kcr Press Meet: ఎన్డీయే పాలనలో లక్షల కోట్ల కుంభకోణాలు.. షాకింగ్ ఆరోపణలు చేసిన సీఎం కేసీఆర్..
Cm Kcr
Follow us on

Cm Kcr Press Meet: గతంలో ఏ ప్రభుత్వంలోనూ జరుగని కుంభకోణాలు ఎన్డీయే ప్రభుత్వ హయాంలో జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. గాలి తప్ప సామాన్యులు వినియోగించే ప్రతీదానిపై ట్యాక్స్ వేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. బడా కంపెనీలకు మాత్రం ఎన్‌పీఏల పేరుతో లక్షల కోట్లు దోచి పెడుతోందని సంచలన ఆరోపణలు చేశారు.

5G స్పెక్ట్రం కుంభకోణం..

5G స్పెక్ట్రం వేలం అతిపెద్ద కుంభకోణం అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. 5 లక్షల కోట్ల అంచనాలకు లక్షన్నర కోట్లే వస్తాయా? అని కేంద్రాన్ని నిలదీశారు. 2G పై పెద్ద పెద్ద ఆందోళనలు చేసిన బీజేపీ.. ఇప్పుడు చేస్తున్న కుంభకోణాల సంగతేంటి? అని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

బ్యాంక్ రుణాల ఎగవేతలు..

బ్యాంకు రుణాల ఎగవేత పేరుతో భారీ కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు ముఖ్యమంత్రి కేసీఆర్. రుణాల తీసుకుని ఎగ్గొట్టిన బడా పారిశ్రామికవేత్తలు.. విదేశాలకు వెళ్లి జల్సాలు చేస్తున్నారని అన్నారు. వీరికి ప్రభుత్వం సహకారం ఉందన్నారు. లేదంటే.. ఇప్పటి వరకు ఒక్కరిని కూడా ఎందుకు తిరిగి ఇండియాకు తీసుకురాలేకపోయిందని సూటిగా ప్రశ్నించారు సీఎం కేసీఆర్.

ఎన్‌పీఏల దందా..

ఎన్డీయే ప్రభుత్వంలో ఎన్‌పీఏల దందా నడుస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఎన్‌పీఏలను ఎందుకు ఇస్తున్నారని కేంద్రాన్ని నిలదీశారు. ఎన్‌పీఏల పేరుతో బిగ్ స్కామ్ నడుస్తోందన్నారు. 2004-05 నాటికి ఎన్‌పిఏ లు రూ. 58 వేల కోట్లు ఉంటే.. ఇప్పుడు ఎన్‌పిఏ లు రూ. 20.07 లక్షల కోట్లు ఉంది. కమీషన్లు తీసుకుని ఎన్‌పిఏ లు ప్రకటిస్తున్నారని ఆరోపించారు ముఖ్యమంత్రి కేసీఆర్.

మోదీ మిత్రుడు అంటూనే యుద్ధం ప్రకటన..

ప్రధాని మోదీకి తనకు వ్యక్తిగత విరోధం లేదంటూ ఆయనపై యుద్ధం ప్రకటించారు సీఎం కేసీఆర్. దేశ ప్రగతి కోసం సంఘర్షణ తప్పదని అన్నారు. పాలు, శ్మశానం, చేనేతపై జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గాలిపై తప్ప అన్నింటిపై పన్నులు వేస్తున్నారని, సామన్య ప్రజల రక్తం తాగేస్తున్నారంటూ కేంద్రం విధానాలను తూర్పారబట్టారు సీఎం కేసీఆర్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..