Telangana: ప్రాణం తీసిన క్రెడిట్ కార్డ్‌.. తండ్రి భరోసా ఇచ్చినా..

|

Oct 21, 2024 | 7:59 AM

స్థోమతకు మించిన అప్పులు, అర్హతకు మించిన ఆశలు మనిషి జీవితాన్ని కష్టాల్లోకి నెట్టేస్తుంటాయి. ఈ విషయం తెలిసినా చాలా మంది ఈ ఊబిలో ఇరుక్కుపోయి ప్రాణాలు సైతం కోల్పోతుంటారు. తాజాగా వరంగల్ జిల్లాకు చెందిన ఓ యువకుడు క్రెడిట్ కార్డులను విచ్చలవిడిగా వాడి, చివరికి ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరుకున్నాడు..

Telangana: ప్రాణం తీసిన క్రెడిట్ కార్డ్‌.. తండ్రి భరోసా ఇచ్చినా..
Warangal
Follow us on

బెట్టింగ్‌ యాప్స్‌లో డబ్బులు పొగొట్టుకొని కొందరు స్థోమతకు మించి అప్పులు చేసి మరికొందరు. జీవితాన్ని మధ్యలోనే ముగిస్తున్నారు, కన్నవారికి కడుపు కోత పెడుతున్నారు. ఆర్థిక క్రమశిక్షణు మరిచి చేతికందినకాడికి అప్పులు చేస్తూ ఊబిలో మునిగిపోతున్నారు. చివరికి ఎంతో విలువైన ప్రాణాలనే వదిలేస్తున్నారు. తాజాగా ఇఇలాంటి ఓ ఘటనే వరంగల్‌ జిల్లాలో జరిగింది.

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన దార ప్రసాద్‌ (38) డిగ్రీ పూర్తి చేసి ఏడేళ్లుగా హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఇదే సమయంలో పలు బ్యాంకుల నుంచి ఏకంగా 10 క్రెడిట్ కార్డులను తీసుకున్నాడు. వాటిని ఇష్టానుసారంగా లిమిట్ మొత్తాన్ని వాడేశాడు. తీరా తిరిగి చెల్లించడానికి చేతిలో చిల్లిగవ్వ లేదు. దీంతో చేసేది ఏం లేక బిల్స్‌ను తరచూ వాయిదా వేస్తూ వచ్చాడు. అయితే బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరిగింది. క్రిడిట్‌ కార్డు బిల్లు చెల్లించాలంటూ తరచూ బ్యాంకు అధికారుల నుంచి ఫోన్‌లు రావడం ప్రారంభమయ్యాయి.

ఈ క్రమంలోనే తాజాగా దసరా పండుగను పురస్కరించుకొని ఈనెల 10వ తేదీన స్వగ్రామానికి వెళ్లాడు. ఇంటికి వచ్చినప్పటికీ నుంచి ఫోన్‌ కాల్స్‌లో ఎక్కువగా మాట్లాడుతుండడంతో అనుమానం వచ్చిన త్రండి రాములు ఏమైందని అడిగాడు. దీంతో అసలు విషయం చేప్పేశాడు ప్రసాద్‌. అయితే తండ్రి భరోసా ఇచ్చాడు. దిగులు పడకమని ఎక్కడైనా అప్పు చేసి పూర్తి బిల్స్‌ను చెల్లిద్దామని, ధైర్యంగా ఉండమని చెప్పాడు. అయితే ప్రసాద్ మాత్రం ధైర్యాన్ని కోల్పోయాడు.

ఏమనుకున్నాడో ఏమో కానీ శనివారం ఉదయం కుటుంబసభ్యులు పొలానికి వెళ్లిన సమయాన్ని చూసుకొని ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ప్రాణాలు వదిలాడు. సాయంత్రం పొలం పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు ప్రసాద్ విగత జీవిగా కనిపించాడు. చేతికొచ్చిన కొడుకు ప్రాణాలు లేకుండా ఉండడం చూసిన వాళ్లు గుండెలు పగిలేలా రోదించారు. అప్పుడు కడతామని చెప్పినా ఇలా చేశావేంటి కొడకా.. అంటూ తండ్రి రాములు కన్నీరు మున్నీరయ్యాడు. దీంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. రాములు ఆదివారం దుగ్గొండి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారణ చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..