తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ

పాలనా సౌలభ్యం కోసం మరో శాఖను విభజిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పన్నుల వసూళ్లలో సౌలభ్యం, పన్ను చెల్లింపుదారుల సంఖ్య వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య పన్నుల శాఖను పునర్వ్యవస్థీకరించింది.

తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ
Follow us

|

Updated on: Sep 16, 2020 | 1:13 PM

పాలనా సౌలభ్యం కోసం మరో శాఖను విభజిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పన్నుల వసూళ్లలో సౌలభ్యం, పన్ను చెల్లింపుదారుల సంఖ్య వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య పన్నుల శాఖను పునర్వ్యవస్థీకరించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖలో 12 డివిజన్లు, 102 వాణిజ్య పన్నుల సర్కి ళ్లు కొనసాగుతున్నాయి. ఈ 102 సర్కిళ్లకు అదనంగా మరో 18 సర్కిళ్లను ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసింది. దీంతో సర్కిళ్ల సంఖ్య 120కి పెంచుతూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు అనుగుణంగా వివిధ కేడర్లలోని కింది స్థాయి పోస్టులను రద్దు చేసి, ఉన్నత స్థాయి పోస్టుల సంఖ్యను పెంచింది. కొత్తగా 161 ఉన్నత స్థాయి పోస్టులను మంజూరు చేసింది. దీంతో జాయింట్‌ కమిషనర్‌-3, డిప్యూటీ కమిషనర్‌-6, అసిస్టెంట్‌ కమిషనర్‌-10, కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌-18, డిప్యూటీ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌-59, అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ పోస్టులు-65 చొప్పున మొత్తం 161 పోస్టులకు శాఖపరమైన అనుమతులను ఇచ్చింది. అంతేకాకుండా జూనియర్‌ స్టెనోలు-37, టైపిస్టులు-30, రికార్డ్‌ అసిస్టెంట్‌-35, సీనియర్‌ డ్రైవర్లు-6, డ్రైవర్లు-53 పోస్టులను రద్దు చేసింది. ప్రభుత్వానికి రావల్సిన ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం విస్తృతస్థాయి పన్నుల బకాయిలను రాబట్టేందుక యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేసింది రాష్ట్ర సర్కార్.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు