AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లోనే మినీ ఐమాక్స్ అనుభూతి కావాలా.. అదిరిపోయే ఫీచర్లతో XGIMI Horizon 20!

వీకెండ్ వచ్చిందంటే చాలు థియేటర్‌కు వెళ్లే ఓపిక చాలా మందికి ఉండట్లేదు. ఇంట్లోనే థియేటర్ కిక్ కావాలనుకునే వారికోసం ఎక్స్‌జిమి (XGIMI) సంస్థ 'Horizon 20' అనే స్మార్ట్ ప్రొజెక్టర్‌ను అందుబాటులోకి తెచ్చింది. 4K క్లారిటీ, ట్రిపుల్ లేజర్ పవర్, ఇన్-బిల్ట్ గూగుల్ టీవీతో వస్తున్న ఈ గ్యాడ్జెట్, మీ లివింగ్ రూమ్‌ను మినీ ఐమాక్స్ థియేటర్‌గా ఎలా మారుస్తుందో తెలుసుకుందాం.

ఇంట్లోనే మినీ ఐమాక్స్ అనుభూతి కావాలా.. అదిరిపోయే ఫీచర్లతో XGIMI Horizon 20!
Xgimi Horizon 20.jpg
Nikhil
|

Updated on: Jul 07, 2026 | 8:10 PM

Share

పెద్ద పెద్ద టీవీలు కొనే బడ్జెట్ లేకపోయినా, థియేటర్ తరహా అనుభూతిని పొందాలనుకుంటున్నారా? అయితే XGIMI Horizon 20 ప్రొజెక్టర్ మీకోసమే! 300 ఇంచుల వరకు భారీ స్క్రీన్, అద్భుతమైన సౌండ్ సిస్టమ్‌తో వస్తున్న ఈ ప్రొజెక్టర్, పగలు కూడా స్పష్టమైన విజువల్స్‌ను అందిస్తుంది. గేమింగ్, సినిమాల కోసం అత్యంత అనువైన ఈ లేటెస్ట్ స్మార్ట్ ప్రొజెక్టర్ ప్రత్యేకతలు, టెక్నాలజీ, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

సాధారణ ప్రొజెక్టర్లను సెట్ చేయడం ఒకప్పుడు తలనొప్పిగా ఉండేది. కానీ XGIMI Horizon 20లో ఉన్న ‘ఇంటెలిజెంట్ స్క్రీన్ అడాప్టేషన్’ టెక్నాలజీ వల్ల, ప్రొజెక్టర్‌ను ఎక్కడ పెట్టినా అది సెకన్లలోనే ఆటోమేటిక్‌గా ఫోకస్ అవుతుంది. గోడ వంకరగా ఉన్నా ‘ఆటో కీస్టోన్ కరెక్షన్’ ద్వారా విజువల్స్ స్ట్రెయిట్‌గా మారిపోతాయి.

క్రిస్టల్ క్లియర్ పిక్చర్..

సాధారణ ప్రొజెక్టర్లు వెలుతురులో మసకబారుతాయి, కానీ ఇది అడ్వాన్స్‌డ్ RGB ట్రిపుల్ లేజర్ లైట్ ఇంజిన్‌తో 3200 ISO ల్యూమెన్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. పగలు లైట్లు ఆన్ చేసి ఉన్నా కలర్స్ చాలా పంచిగా కనిపిస్తాయి. ఇందులో ఉన్న True 4K UHD రిజల్యూషన్, డాల్బీ విజన్ మరియు ఐమాక్స్ ఎన్‌హాన్స్‌డ్ సర్టిఫికేషన్ వల్ల థియేటర్ స్థాయిలో డీప్ బ్లాక్ కలర్స్, బ్రైట్ హైలైట్స్‌ను 300 ఇంచుల స్క్రీన్‌పై ఎంజాయ్ చేయవచ్చు.

గూగుల్ టీవీ

ఇందులో గూగుల్ టీవీ బిల్ట్-ఇన్‌గా ఉండటంతో ఫైర్ స్టిక్ అవసరం లేదు. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వంటి యాప్స్ స్మూత్‌గా రన్ అవుతాయి. ఆడియో కోసం గ్లోబల్ బ్రాండ్ ‘హార్మన్ కార్డన్’ స్పీకర్లను ఇందులో అమర్చారు, ఇవి రూమ్ మొత్తం రిజౌండ్ అయ్యేలా క్రిస్టల్ క్లియర్ సౌండ్‌ను అందిస్తాయి. ఇక గేమింగ్ లవర్స్ కోసం ఇందులో ‘లో-లేటెన్సీ గేమింగ్ మోడ్’ ఉంది, ఇది PS5 లేదా ఎక్స్‌బాక్స్ గేమింగ్‌ను చాలా స్మూత్‌గా మారుస్తుంది. మీ ఇంటిని ఒక పర్సనల్ థియేటర్‌గా మార్చుకోవాలనుకునే వారికి, XGIMI Horizon 20 ఒక అల్టిమేట్ ఆప్షన్. ఇటు పగలు, అటు రాత్రి ఎప్పుడైనా హై-క్వాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్ అందించడంలో ఈ స్మార్ట్ ప్రొజెక్టర్‌కు తిరుగులేదు.

Follow Us
గోడపైనే 300 ఇంచుల స్క్రీన్, సినిమాటిక్ అనుభూతి
గోడపైనే 300 ఇంచుల స్క్రీన్, సినిమాటిక్ అనుభూతి
వర్క్‌ ఫ్రమ్ హోమ్‌ చేసే వాళ్ల ఇంట్లో ఇది ఉండాల్సిందే
వర్క్‌ ఫ్రమ్ హోమ్‌ చేసే వాళ్ల ఇంట్లో ఇది ఉండాల్సిందే
విష యోగం ప్రభావం.. ఈ రాశుల వారి జీవితం అల్లకల్లోలమే
విష యోగం ప్రభావం.. ఈ రాశుల వారి జీవితం అల్లకల్లోలమే
ఓటీటీలో 'ఓజీ' నటుడి రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.1 రేటింగ్
ఓటీటీలో 'ఓజీ' నటుడి రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.1 రేటింగ్
టీమిండియాకు ఇక సంజూ శాంసన్ దూరమైనట్లేనా ?
టీమిండియాకు ఇక సంజూ శాంసన్ దూరమైనట్లేనా ?
వచ్చే మూడు వారాలే కీలకం.. కుంభ రాశి జాతకంలో ఏం జరగనున్నదంటే..
వచ్చే మూడు వారాలే కీలకం.. కుంభ రాశి జాతకంలో ఏం జరగనున్నదంటే..
గ్యాస్ సిలిండర్లు వేర్వేరు రంగుల్లో ఎందుకుంటాయో తెలుసా..?
గ్యాస్ సిలిండర్లు వేర్వేరు రంగుల్లో ఎందుకుంటాయో తెలుసా..?
ఏడేళ్ల చిన్నారి మహాదానం.. అవయవదానం చేసి ఆరుగురికి కొత్త జీవితం
ఏడేళ్ల చిన్నారి మహాదానం.. అవయవదానం చేసి ఆరుగురికి కొత్త జీవితం
మెరుగైన విద్యకు కేరాఫ్. ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్
మెరుగైన విద్యకు కేరాఫ్. ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్
విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.33 కోట్లతో కొత్త స్కూళ్లు
విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.33 కోట్లతో కొత్త స్కూళ్లు