Phone Battery Explosion: ఈ తప్పులు చేశారంటే మీ ఫోన్‌ ఏ క్షణమైనా పేలిపోవచ్చు.. బీ కేర్ ఫుల్!

|

Jul 15, 2024 | 6:00 AM

ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. అయితే ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగించేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ అవసరం. బయటి వాతావరణం వేడిగా ఉన్నప్పుడు మరింత శ్రద్ధ అవసరం. స్మార్ట్ ఫోన్లను ఎక్కువ సేపు వాడినా, కంటిన్యూగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడినా త్వరగా వేడెక్కుతుంది. నేటి కాలంలో ఫోన్ వినియోగం పెరుగుతుండటంతో ప్రతి ఒక్కరూ..

Phone Battery Explosion: ఈ తప్పులు చేశారంటే మీ ఫోన్‌ ఏ క్షణమైనా పేలిపోవచ్చు.. బీ కేర్ ఫుల్!
Phone Explosion
Follow us on

ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. అయితే ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగించేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ అవసరం. బయటి వాతావరణం వేడిగా ఉన్నప్పుడు మరింత శ్రద్ధ అవసరం. స్మార్ట్ ఫోన్లను ఎక్కువ సేపు వాడినా, కంటిన్యూగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడినా త్వరగా వేడెక్కుతుంది. నేటి కాలంలో ఫోన్ వినియోగం పెరుగుతుండటంతో ప్రతి ఒక్కరూ గంటల తరబడి వీటితో గడుపుతున్నారు. అయితే వీటి వినియోగంపై ఏమాత్రం అవగాహన లేకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి. బ్యాటరీ వేడెక్కడం వల్ల పేలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరూ స్మార్ట్‌ ఫోన్‌ వినియోగిస్తున్నట్లయితే ఈ కింది విషయాలను గుర్తుంచుకోండి. లేదంటే ఊహించని ప్రమాదాలు మిమ్మల్ని రిస్క్‌లో పడేస్తాయి.

స్మార్ట్ ఫోన్‌ బ్యాటరీలు పేలకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..

  • ఎట్టిపరిస్థిత్తుల్లోనూ ఎక్కువ సేపు ఫోన్‌ను ఛార్జ్ చేయకూడదు. ఛార్జ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది అనేది ప్రతి ఫోన్ బ్యాటరీ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి 2-4 గంటల కంటే ఎక్కువ సమయం ఫోన్‌ ఛార్జ్ చేయకూడదు.
  • ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు మాట్లాడకూడదు. ఫోన్ ఛార్జింగ్‌లో ఉంటే అది త్వరగా వేడెక్కుతుంది. అదే సమయంలో మీరు ఆ ఫోన్‌ ద్వారా కాల్ చేస్తే, అది ఫోన్ బ్యాటరీపై ఒత్తిడిని కలిగిస్తుంది.
  • మీరు పనిలో బిజీగా ఉన్నప్పుడు మీ ఫోన్‌ను ఎండలో ఉంచకూడదు. మీరు ఎండగా ఉన్న ప్రదేశంలో ఉంటే.. మీ ఫోన్‌ను బ్యాగ్‌ లేదా ఏదైనా సురక్షిత ప్రదేశంలో ఉంచాలి. ఇది ఫోన్ సమస్యను మరింత పెంచే అవకాశం ఉంది.
  • ఫోన్ బ్యాటరీ పాడైతే, బలవంతంగా దానిని వినియోగించకూడదు. వీలైనంత త్వరగా దాన్ని మార్చి, కొత్త బ్యాటరీ అందులో వేయండి. ఫోన్ వెనుక భాగంలోని కొన్ని భాగాల నుంచి ద్రవం బయటకు రావడాన్ని గమనించినా నిర్లక్ష్యం చేయకండి. వెంటనే బ్యాటరీ మార్చి కొత్తది తీసుకోవడం మంచిది.
  • అలాగే గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడకండి. దీనివల్ల సమస్య పెరుగుతుంది. ఫోన్‌కి విశ్రాంతి ఇవ్వాలి. చల్లబరచడానికి వీలైన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి.