WhatsApp Facebook Down India: అరగంట బ్రేక్‌ తర్వాత తిరిగి ప్రారంభమైన వాట్సాప్‌ సేవలు.. కారణమేంటో తెలియాల్సి ఉంది.

|

Mar 19, 2021 | 11:43 PM

WhatsApp Facebook Down India: ప్రముఖ సోషల్‌ మీడియా సైట్లు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. భారత్‌ సహా ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ సోషల్‌ మీడియా సైట్ల సేవలకు బ్రేక్‌ పడింది. దీంతో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు...

WhatsApp Facebook Down India: అరగంట బ్రేక్‌ తర్వాత తిరిగి ప్రారంభమైన వాట్సాప్‌ సేవలు.. కారణమేంటో తెలియాల్సి ఉంది.
Whats App Down
Follow us on

WhatsApp Facebook Down India: ప్రముఖ సోషల్‌ మీడియా సైట్లు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు ఒక్కసారిగా నిలిచిపోయి యూజర్లను కాసింత ఆందోళనకు గురి చేసింది. భారత్‌ సహా పలు దేశాల్లో సుమారు 30 నిమిషాలపాటు నిలిచిపోయిన సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి.
మెసేజ్‌లు సెండ్‌ కాకపోవడం, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లో ఫీడ్‌ రీఫ్రెష్‌ కాకపోవడంతో యూజర్లు గందరగోళానికి గురయ్యారు. అయితే సుమారు అరగంట తర్వాత ఈ సోషల్‌ మీడియా సైట్‌ సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉంటే.. వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు ఫేస్‌బుక్‌ మాతృ సంస్థకు చెందిన కంపెనీలనే విషయం తెలిసిందే. ఈ మూడు సర్వీసులు ఒకేసారి నిలిచిపోవడం గమనార్హం. ఇంతకీ ఈ మూడు సోషల్‌ మీడియా సేవలు ఒకేసారి ఎందుకు నిలిచిపోయాయన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read: Salary Hike: ఆరు నెలల్లోనే రెండోసారి ఇంక్రిమెంట్‌ ప్రకటించిన టీసీఎస్‌.. ఆశ్చర్యంలో ప్రైవేటు సంస్థలు..

Find My Phone: మీ స్మార్ట్‌ఫోన్‌ పోయిందా?.. మరేం పర్వాలేదు ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఫోన్ ఎక్కడున్నా కనిపెట్టొచ్చు..

RedMi Smart TV: కొత్తగా మూడు స్మార్ట్‌టీవీలను విడుదల చేసిన రెడ్‌ మీ.. ఫీచర్లు తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..