WhatsApp: సెలబ్రీటీల వాయిస్‌తో చాటింగ్.. వాట్సాప్ కొత్త ఫీచర్ అదిరిపోయింది..

|

Sep 15, 2024 | 6:25 PM

మెటా సంస్థ తన ఇన్ స్టంట్ మేనేజింగ్ యాప్ వాట్సాప్‌కు టూవే వాయిస్ చాట్ ఏఐ ఫీచర్ ను జోడించనుంది. దీని ద్వారా వినియోగదారులు వాయిస్ చాట్ లో కొత్త అనుభవం పొందుతారు. ప్రముఖుల వాయిస్ ను నియోగించుకునేందుకు అవకాశం లభిస్తుంది. వాట్సాప్ బీటా ఇన్ ఫో వెల్లడించిన వివరాల ప్రకారం..

WhatsApp: సెలబ్రీటీల వాయిస్‌తో చాటింగ్.. వాట్సాప్ కొత్త ఫీచర్ అదిరిపోయింది..
Whatsapp
Follow us on

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు మెరుగైన సేవలు అందించడానికి నిరంతరం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా అనేక ఫీచర్లను అప్ డేట్ చేస్తోంది. ఈ యాప్ కు యూజర్ల కూడా బాగా ఎక్కువ. వాట్సాప్ యాప్ లేని స్మార్ట్ ఫోన్ ఉండదు. అంతలా ప్రజలందరికీ దగ్గరైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరో ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. మెటా ఏఐ వాయిస్ ఫీచర్ తో ప్రముఖుల వాయిస్‌లను ఉపయోగించి చాట్ చేసుకోవడానికి వీలుంటుంది. నలుగురు ప్రముఖుల వాయిస్ లను దీనిలో అప్ డేట్ చేస్తారు. అయితే ఆ ప్రముఖులు ఎవ్వరనేది ఇంకా వెల్లడించలేదు.

టూవే వాయిస్ చాట్ ఫీచర్..

మెటా సంస్థ తన ఇన్ స్టంట్ మేనేజింగ్ యాప్ వాట్సాప్‌కు టూవే వాయిస్ చాట్ ఏఐ ఫీచర్ ను జోడించనుంది. దీని ద్వారా వినియోగదారులు వాయిస్ చాట్ లో కొత్త అనుభవం పొందుతారు. ప్రముఖుల వాయిస్ ను నియోగించుకునేందుకు అవకాశం లభిస్తుంది. వాట్సాప్ బీటా ఇన్ ఫో వెల్లడించిన వివరాల ప్రకారం.. మెటా సంస్థ ఏఐకి సంబంధించిన వివిధ వాయిస్ ఆప్షన్లపై పనిచేస్తోంది. ఈ కొత్త వాయిస్ ఫీచర్ లో ప్రముఖుల వాయిస్ లు ఉంటాయి. అలాగే వివిధ రకాల పిచ్, టోనాలిటీ, యాక్సెంట్ తో విభిన్న స్వరాలను అందించనుంది. వాట్సాప్ తన ఏఐ చాట్ బాట్ ను టూ వే వాయిస్ చాట్ ఫీచర్‌కు అనుసంధానం చేసి, అప్‌గ్రేడ్ చేయాలని చూస్తోంది. దీని ద్వారా ప్రముఖ వ్యక్తుల వాయిస్‌లతో యూజర్లు ఇంటరాక్ట్ అవ్వడానికి వీలు కలుగుతుంది.

మెటా ఏఐ వాయిస్ మోడ్..

ఈ వాయిస్ చాట్ ఫీచర్ త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే త్వరలో వినియోగదారులందరూ ప్రసిద్ధ వ్యక్తులతో సహా పలు రకాల వాయిస్‌లకు యాక్సెస్‌ పొందే అవకాశం ఉంది. యూకే, యూఎస్ యాసలతో సహా అనేక స్వరాలను ఎంచుకోగలుగుతారు. గత ఏడాది మెటా మెసెంజర్ లో కస్టమ్ ఏఐ చాట్ బాట్ ను ప్రవేశపెట్టింది.

మెరుగైన సేవలు..

వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించే క్రమంలో వాట్సాప్ లో ఏఐ సామర్థ్యాలను పెంపుదల కనిపిస్తోంది. వాటి అమలులో పురోగతిని సూచిస్తోంది. మెటా ఏఐ చాట్ బాట్ తో యూజర్లకు మరింత సౌకర్యవంతమైన చాటింగ్ అనుభవం కలుగుతుంది. ప్రముఖుల వాయిస్ లతో చాట్ చేసుకోవడం వినియోగదారులకు సరికొత్తగా ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..