Google’s AI Feature: ఒక్క క్లిక్‌తో టెక్ట్స్ నుంచి పాడ్‌కాస్ట్.. గూగుల్ కొత్త ఏఐ ఫీచర్ ఎలా వాడాలంటే..

|

Sep 15, 2024 | 5:24 PM

ఇకపై టెక్ట్స్ టు స్పీచ్ అంటే టెక్ట్స్ నుంచి పాడ్ కాస్ట్ తయారు చేయడం చాలా ఈజీగా జరిగిపోనుంది. అందుకోసం ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఓ కొత్త ఫీచర్ ను తీసుకొస్తోంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ నోట్స్ ఇన్ టూ ఏఐ జనరేటెడ్ పాడ్ కాస్ట్ ఫీచర్ నోట్ బుక్ కేఎల్ఎం‌లో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Googles AI Feature: ఒక్క క్లిక్‌తో టెక్ట్స్ నుంచి పాడ్‌కాస్ట్.. గూగుల్ కొత్త ఏఐ ఫీచర్ ఎలా వాడాలంటే..
Google's Ai Feature Can Convert Your Notes Into Podcast
Follow us on

ప్రస్తుతం మార్కెట్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత టూల్స్, ఫీచర్లు అధికవమవుతున్నాయి. మనిషి సౌకర్యంతో పాటు సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. వీటి ద్వారా పనులు వేగంగా పూర్తవుతున్నాయి. ఇప్పటి వరకూ స్పీచ్ టు టెక్ట్స్ ఫీచర్ మనం చూశాం. ఇకపై టెక్ట్స్ టు స్పీచ్ అంటే టెక్ట్స్ నుంచి పాడ్ కాస్ట్ తయారు చేయడం చాలా ఈజీగా జరిగిపోనుంది. అందుకోసం ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఓ కొత్త ఫీచర్ ను తీసుకొస్తోంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ నోట్స్ ఇన్ టూ ఏఐ జనరేటెడ్ పాడ్ కాస్ట్ ఫీచర్ నోట్ బుక్ కేఎల్ఎం‌లో అందుబాటులో ఉంది. గూగుల్ కు చెందిన ఏఐ ఆధారిత నోట్ టేకింగ్ యాప్ మీ మేటీరియల్ ను సమ్మరైజ్ చేయడమే కాకుండా టాపిక్స్ మధ్య కనెక్షన్ ను కూడా అందిస్తుందని గూగుల్ పేర్కొంది.

డాక్యుమెంట్స్ ను ఆడియోగా..

గూగుల్ చెబుతున్న ఈ కొత్త ఫాంక్షనాలిటీని డబ్డ్ ఆడియో ఓవర్ వ్యూ గా పిలుస్తోంది. సింగిల్ క్లిక్ సాయంతో డాక్యుమెంట్స్ ను ఆడియోగా కన్వర్ట్ చేయగలుగుతుందని గూగుల్ ఓ బ్లాగ్ పోస్టులో తెలిపింది. మనం ఇచ్చిన కంటెంట్ ఆధారంగా రెండు ఏఐ హోస్ట్స్ డీప్ డైవ్ ను ప్రారంభించి పాడ్ కాస్ట్‌ను పూర్తి చేస్తాయి. వినియోగదారులు ఈ ఏఐ జనరేట్ చేసిన సంభాషణను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కొత్త నోట్‌బుక్‌ఎల్‌ఎమ్ ఫీచర్‌ని ప్రయత్నించిన ది వెర్జ్ ప్రకారం , ఏఐ హోస్ట్‌లు ఆధునిక పదబంధాలను ఉపయోగిస్తాయి. మానవుల వలె ధ్వనిస్తాయి. అయితే దీనిలో కొన్ని లోపాలు ఉన్నాయి. కొన్ని పదాలను స్పష్టంగా పలుకలేకపోతోంది. ఈ ఏఐ కొన్నిసార్లు “P-L-U-S” వంటి పదాలను స్పెల్లింగ్ చెబుతోంది.

ఎలా ఉపయోగించాలంటే..

కొత్త ఫీచర్‌ని ఉపయోగించడానికి నోట్‌బుక్‌ ఎల్ఎం లోని మీ నోట్‌బుక్‌లలో ఒకదాన్ని తెరిచి, నోట్‌బుక్ గైడ్‌ని ఓపెన్ చేయండి. ఆడియో ఓవర్‌వ్యూను రూపొందించడానికి “జెనరేట్” బటన్‌పై క్లిక్ చేయండి.

వినియోగదారులకు ఈ కొత్త ఫీచర్ ఉపయోగకరమైన సాధనం అయినప్పటికీ, ఫంక్షనాలిటీ ఇప్పటికీ పరీక్షల దశలోనే ఉందని.. కొన్ని తెలిసిన పరిమితులను కలిగి ఉందని గూగుల్ పేర్కొంది. ఉదాహరణకు, మీ వద్ద పెద్ద నోట్‌బుక్ ఉంటే, ఆడియో ఓవర్‌వ్యూని రూపొందించడానికి కొన్ని నిమిషాలు పట్టవచ్చు. అలాగే ఏఐ-ఆధారిత హోస్ట్‌లు ప్రస్తుతం ఇంగ్లిష్ కు మాత్రమే పరిమితం అయ్యాయి. కొన్నిసార్లు తప్పులు కూడా చెప్పే అవకాశం ఉంది. అలాంటప్పుడు వాటిని నిలిపివేసే అవకాశం ప్రస్తుతానికి లేదు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..