Deepfake technology: మనిషినే మింగేస్తున్న టెక్నాలజీ.. పెరిగిన డీప్ ఫేక్ వీడియోలతో ఆ ఇబ్బందులు డబుల్

|

Aug 23, 2024 | 4:30 PM

గతంలో పెద్దవాళ్లు అనేక మంచి విషయాలు చెప్పేవారు. మన కంటితో చూసిన విషయాన్నే నమ్మాలని, అవతలి వాళ్లు చెప్పిన దాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయాలు తీసుకోకూడదనేవారు. కానీ నేడు కాలం మారింది. మన కంటితో చూసింది కూడా నిజమా, కాదా అనే సందేహం కలుగుతోంది. ఆధునిక టెక్నాలజీ అనేక కొత్త పుంతలు తొక్కుతోంది. అన్ని పనులలో మనిషికి సాయపడే స్థాయి నుంచి సాటి మనిషిని మాయ చేసే స్థాయికి ఎదిగింది. ఏది నిజమో, ఏది అబద్దమో కూడా గుర్తించలేని స్థితికి తీసుకువెళుతోంది.

Deepfake technology: మనిషినే మింగేస్తున్న టెక్నాలజీ.. పెరిగిన డీప్ ఫేక్ వీడియోలతో ఆ ఇబ్బందులు డబుల్
Deep Fake
Follow us on

గతంలో పెద్దవాళ్లు అనేక మంచి విషయాలు చెప్పేవారు. మన కంటితో చూసిన విషయాన్నే నమ్మాలని, అవతలి వాళ్లు చెప్పిన దాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయాలు తీసుకోకూడదనేవారు. కానీ నేడు కాలం మారింది. మన కంటితో చూసింది కూడా నిజమా, కాదా అనే సందేహం కలుగుతోంది. ఆధునిక టెక్నాలజీ అనేక కొత్త పుంతలు తొక్కుతోంది. అన్ని పనులలో మనిషికి సాయపడే స్థాయి నుంచి సాటి మనిషిని మాయ చేసే స్థాయికి ఎదిగింది. ఏది నిజమో, ఏది అబద్దమో కూడా గుర్తించలేని స్థితికి తీసుకువెళుతోంది. ముఖ్యంగా రియల్ టైమ్ డీప్ ఫేక్ టెక్నాలజీతో అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి. దీన్ని ఎంటర్ టైన్మెంట్ కోసం ఎంత వాడుకున్నా తప్పులేదు. ఆ పరిధిని మించి మోసాలు చేయడానికి, తప్పుదోవపట్టించడానికి ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రెటీలను లక్ష్యంగా చేసుకుని ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారు. వాటిని ఇంటర్నెట్ లోకి విడుదల చేస్తున్నారు. ఆ వీడియోలతో వ్యక్తిగత గౌరవానికి ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇటీవల సినీనటి రష్మిక పేరుతో విడుదలైన డీప్ ఫేక్ వీడియో దీనికి నిదర్శనం.

డీప్‌ఫేక్ టెక్నాలజీ రోజు రోజుకూ అభివృద్ధి చెందుతోంది. దాని దుర్వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఇటీవల డీప్ లైవ్ క్యామ్ అనే కొత్త సాఫ్ట్‌వేర్ ప్యాకేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీటి ద్వారా రియల్ టైమ్ డీప్‌ఫేక్‌లను చాలా సులభంగా సృష్టిస్తున్నారు. ఆ సాఫ్ట్‌వేర్ ఒక వ్యక్తి ఫోటోను తీసి, ఆ ముఖాన్ని ప్రత్యక్ష వెబ్‌క్యామ్ ఫీడ్‌కి పంపిస్తుంది. దాని నుంచి ఆ ఫొటోలో అనేక మార్పులు చేసుకోవచ్చు. ఉదాహరణకు గడ్డం ఉంటే తీసేయవచ్చు. జుట్టును మార్పుకోవచ్చు. మీసం లేకపోయినా పెట్టుకోవచ్చు. ముసలి తనంలో ఉన్నట్టు మార్చుకోవచ్చు. ఈ విధానం కొంత ఆశ్చర్యాన్ని కలిగించినా, తర్వాత అనేక మోసాలకు కారణమవుతుందనే విమర్శలు వస్తున్నాయి.

డీప్ లైవ్ క్యామ్ ప్రాజెక్ట్ గతేడాది చివరి నుంచి అభివృద్ధిలో ఉంది. దీని ద్వారా తీసిన వీడియోలను ఆన్‌లైన్‌లో ప్రసారం చేయడం ప్రారంభించిన తర్వాత ఇటీవల వైరల్ అయ్యింది. ఈ క్లిప్‌లలో కొందరు వ్యక్తులు డీప్ లైవ్ క్యామ్ ను ఉపయోగించి ఎలోన్ మస్క్, జార్జ్ క్లూనీ వంటి ప్రముఖులను అనుకరించారు. ఏది ఏమైనా డీప్ లైవ్ క్యామ్ ను దుర్వినియోగం చేయడంపై అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సాంకేతికతో మోసాలు జరిగే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కొన్ని పదాలను కోడ్ లుగా ఉపయోగించాలని, వాటిని తమ తల్లిదండ్రులు, పిల్లలకు మాత్రమే చెప్పాలని సూచిస్తున్నారు. ఇది వ్యంగ్యంగా అనిపించినప్పుటికీ టెక్ మోసగాళ్ల నుంచి రక్షించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి

డీప్‌ఫేక్ అనే పదం 2017 నుంచి బయటకు వచ్చింది. ఇది రెడ్డిట్ నుంచి ఉద్భవించింది. అతను దానిని హ్యాండిల్‌గా ఉపయోగించి తరచుగా ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేశాడు. ఆ సమయంలో టెక్నాలజీ ఇంత వేగంగా లేదు. ఇప్పుడు డీప్ లైవ్ క్యామ్, ఇతర ప్రాజెక్ట్‌లు చాలా వేగంగా పనిచేస్తున్నాయి. ప్రామాణిక పీసీ ఉన్న ఎవరైనా ఉచిత సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి డీప్‌ఫేక్‌లను రూపొందించగలరు. డీప్ ఫేక్ టెక్నాలజీతో అనేక మోసాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో చైనాలోని స్కామర్లు ఓ కంపెనీ సీఈవోతో సహా ఎగ్జిక్యూటివ్ లుగా నటించారు. ఒక ఉద్యోగిని మోసగించి 25 మిలియన్ల యూఎస్ డాలర్లను బదిలీ చేశారు. అలాగే యూఎస్ లోని న్యూ హాంప్‌షైర్ ప్రైమరీలో ఓటు వేయకుండా ప్రజలను నిరోధించేందుకు ఒక వ్యక్తి ఈ టెక్నాలజీని వాడుకున్నాడు. అతడు జో బిడెన్ స్వరాన్ని క్లోన్ చేశాడు. మొత్తం మీద ఈ టెక్నాలజీ వల్ల మానవాళికి ఎంతో చేటు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి