Instagram: ఇన్ స్టాగ్రామ్ లో త్వరలో సూపర్ ఫీచర్.. యువత భద్రత కోసం మెటా నిర్ణయం

|

Nov 25, 2024 | 7:47 PM

ప్రపంచమంతా సోషల్ మీడియా విస్తరించింది. ప్రజలు తమ ఆలోచనలు, సంతోషాలు, వింతలు, విశేషాలను దీని ద్వారా ఒకరితో మరొకరు పంచుకుంటున్నారు. సోషల్ మీడియా వచ్చాక ప్రపంచం కుగ్రామంగా మారింది. మారుమూల ప్రాంతాల్లో జరిగిన సంఘటలను కూడా క్షణాల్లో అందరికీ తెలిసిపోతున్నాయి. ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో అత్యంత ఆదరణ పొందిన వాటిలో ఇన్ స్టాగ్రామ్ ఒకటి.

Instagram: ఇన్ స్టాగ్రామ్ లో త్వరలో సూపర్ ఫీచర్.. యువత భద్రత కోసం మెటా నిర్ణయం
Instagram
Follow us on

ఇన్‌స్టాగ్రామ్‌కు కోట్లమంది యూజర్లు ఉన్నారు. మెటా యాజమాన్యంలోని ఈ ప్లాట్ ఫాం ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్ లతో దూసుకుపోతుంది. ఇప్పుడు కొత్తగా మరో ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా ఇన్ స్టాగ్రామ్ అల్గారిథమ్ ను రీసెట్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నప్పటికీ, త్వరలో ప్రపంచ వ్యాప్తంగా పరిచయం కానుంది. ఇన్ స్టాగ్రామ్ లో రానున్న కొత్త ఫీచర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీని ద్వారా యూజర్లు తమ ఫీడ్ లలో ఏమి చూస్తారో నిర్ణయించే అల్గారిథమ్ ను రీసెట్ చేసుకోవచ్చు. టీనేజీ యువత భద్రత కోసం కొత్త ఫీచర్ ను రూపొందిస్తున్నట్ట మెటా తెలిపింది. అల్గారిథమ్ అంటే ఇన్ స్టాగ్రామ్ వినియోగదారులకు వారి ఫీడ్ లలో కంటెంట్ ప్రదర్శించే క్రమాన్ని నిర్ణయించే వ్యవస్థ. కొత్త ఫీచర్ల ద్వారా వినియోదారులు తమ ఫీడ్ లలో ఏమి చూస్తారో నిర్ణయించే అల్గారిథమ్ ను సెట్ చేసుకోవచ్చు.

ఎక్స్ ఫ్లోర్, రీల్స్, ఫీడ్ ట్యాబ్ లతో సిఫారసు చేసిన కంటెంటె ను మాన్యువల్ గా రీసెట్ చేయడానికి వినియోగదారులకు కొత్త ఫీచర్ ఉపయోగపడుతుంది. ఒక్కసారి రీసెట్ చేసిన వెంటనే యాప్ గతంలో సూచించిన అంశాల నుంచి విడిపోతుంది. కొత్తగా సూచించిన ప్రాధాన్యతలకు అనుగుణంగా సిఫారసులు అందిస్తుంది. వచ్చిన కంటెంట్ పై ఆసక్తి ఉంది లేదా ఆసక్తి లేదు అనే గుర్తులు పెట్టడం ద్వారా నియంత్రణ ఏర్పడుతుంది. కాలక్రమీణా అల్గారీథమ్ సూచనలను మెరుగుపర్చుకోవచ్చు. యువత మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా తీవ్ర ప్రభావం చూపుతోందని ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి.

గంటల తరబడి ఫోన్లలో గడపడం, వివిధ రకాల కంటెంట్ చూడడం వల్ల అనేక రుగ్మతల బారిన పడుతున్నారు. పెద్దవారికి ఈ సమస్య ఉన్నప్పటికీ టీనేజర్లపై మాత్రం ఎక్కువ ప్రతికూల ప్రభావం చూపుతోంది. రోజుకు మూడు గంటల కంటే ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడిపే టీనేజర్లు రెండింతల డిప్రెషన్, ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తోంది. కొత్త ఫీచర్ తో టీనేజర్లు తమ ఇన్ స్టాగ్రామ్ అనుభవాన్ని మెరుగుపర్చుకోవచ్చు. తమ అభిరుచి, ఆసక్తికి అనుగుణంగా వ్యవహరించవచ్చు. రీసెట్ చేస్తూ ఉండడం వల్ల కొత్త కంటెంట్ ను ఆస్వాదించవచ్చు. మీరు అనుసరించే ఖాతాలను సమీక్షించడం, ఇక చూడకూడదనుకునే వాటిని కంటెంట్ ను ఆపివేయవచ్చు. ముఖ్యంగా టీనేజర్ల భద్రతా కోసం తీసుకువస్తున్న ఈ ఫీచర్ వినియోగదారులందిరికీ అందుబాటులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి