మ్యూజిక్ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్! సోనీ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ చూస్తే కొనాల్సిందే అంటారు
Sony Wireless Headphones.. మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకునేందుకు సోనీ మరోసారి కొత్త వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌తో మార్కెట్లో సందడి చేస్తోంది. బడ్జెట్ ధర నుంచి ప్రీమియం సెగ్మెంట్ వరకు మూడు కొత్త మోడళ్లను తీసుకొచ్చింది. లాంగ్ బ్యాటరీ లైఫ్, Bluetooth 6.0, AI ఆధారిత కాల్ ఫీచర్లతో వస్తున్న ఈ హెడ్‌ఫోన్స్ ప్రస్తుతం టెక్ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

హెడ్‌ఫోన్స్ కొనేటప్పుడు సౌండ్ క్వాలిటీతో పాటు బ్యాటరీ బ్యాకప్, నాయిస్ క్యాన్సలేషన్, కాల్ క్లారిటీకి ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సోనీ మూడు కొత్త వైర్‌లెస్ మోడళ్లను పరిచయం చేసింది. ప్రీమియం యూజర్ల నుంచి తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు కోరుకునే వారి వరకు అందరికీ సరిపోయేలా వీటిని తీసుకొచ్చింది.
మూడు కొత్త హెడ్‌ఫోన్స్!
సోనీ తాజాగా మూడు వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇందులో ప్రీమియం మోడల్‌గా Sony WH-1000XM4C నిలుస్తోంది. దీని ధర రూ.28,105 వరకు ఉంటుంది. సౌండ్ క్వాలిటీపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఈ హెడ్‌ఫోన్‌లో 40mm డ్రైవర్లు, 10 బ్యాండ్ ఈక్వలైజర్, Personal Noise Cancellation Optimizer వంటి ఫీచర్లు ఉన్నాయి.
Noise Cancelling ఆన్‌లో ఉంచితే 27 గంటలు, ఆఫ్ చేస్తే 34 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. Black, Lavender, Platinum Silver రంగుల్లో ఇది అందుబాటులో ఉంటుంది. ఇక మధ్యస్థ బడ్జెట్‌లో Sony WH-CH730N మోడల్‌ను తీసుకొచ్చారు. దీని ధర రూ.12,900. President Voice Pick Up Technology ఆధారంగా AI Call Noise Reduction సదుపాయాన్ని అందించారు. Noise Cancelling ఆన్‌లో 50 గంటలు, ఆఫ్‌లో ఏకంగా 75 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. కేవలం మూడు నిమిషాల ఛార్జింగ్‌తో గంటపాటు ఉపయోగించుకోవచ్చు.
55 గంటల బ్యాటరీ..
తక్కువ ధరలో మంచి ఫీచర్లు కోరుకునేవారి కోసం Sony WH-CH530ను అందించారు. దీని ధర రూ.6,400 మాత్రమే. ఇందులో Multipoint Connectivity, AI Noise Reduction, Voice Assistant వంటి సదుపాయాలు ఉన్నాయి. బ్యాటరీ పరంగా ఇది 55 గంటల వరకు నాన్‌స్టాప్ ప్లేబ్యాక్ అందిస్తుంది. మూడు నిమిషాల ఛార్జింగ్‌తో గంటన్నర పాటు పాటలు వినవచ్చు.
ఈ మూడు మోడళ్లలో Bluetooth 6.0 టెక్నాలజీని అందించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ప్రస్తుతం UK మార్కెట్లో September 10 నుంచి ఇవి అందుబాటులోకి వచ్చాయి. Hello Kitty ప్రత్యేక ఎడిషన్ బండిల్స్‌లో Tote Bag, Carrying Pouches వంటి యాక్సెసరీస్ కూడా లభిస్తున్నాయి. దీంతో యువతను ఆకట్టుకునేలా సోనీ ఈ కొత్త లైనప్‌ను సిద్ధం చేసింది. త్వరలో భారత్‌లోనూ ఇవి లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
