Redmi Turbo3: మార్కెట్లోకి  మరో ఇంట్రెస్టింగ్‌ ఫోన్‌.. 200 ఎంపీ కెమెరాతో పాటు..

|

Apr 07, 2024 | 4:41 PM

రెడ్‌మీ త్వరలోనే టర్బో 3 పేరుతో ఫోన్‌ను తీసుకొస్తున్నారు. అయితే కంపెనీ ఇప్పటి వరకు ఈ ఫోన్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే నెట్టింట మాత్రం ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు వైరల్‌ అవుతున్నాయి. వీటి ప్రకారం..

Redmi Turbo3: మార్కెట్లోకి  మరో ఇంట్రెస్టింగ్‌ ఫోన్‌.. 200 ఎంపీ కెమెరాతో పాటు..
Redmi Turbo 3
Follow us on

ప్రస్తుతం మార్కట్లోకి కొంగొత్త స్మార్ట్ ఫోన్‌లు లాంచ్‌ అవుతూ వస్తున్నాయి. మారుతోన్న టెక్నాలజీ అనుగుణంగా అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను విడుదల చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇస్తూ స్మార్ట్ ఫోన్‌లను తీసుకొస్తున్నాయి కంపెనీలు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. రెడ్‌మీ టర్బో 3 పేరుతో త్వరలోనే ఈ ఫోన్‌ మార్కెట్లోకి రానుంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

రెడ్‌మీ త్వరలోనే టర్బో 3 పేరుతో ఫోన్‌ను తీసుకొస్తున్నారు. అయితే కంపెనీ ఇప్పటి వరకు ఈ ఫోన్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే నెట్టింట మాత్రం ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు వైరల్‌ అవుతున్నాయి. వీటి ప్రకారం.. ఈ ఫోన్‌కు సంబంధించి వెనుక ప్యానెల్‌తో పాటు హ్యాండ్-ఆన్ ఇమేజ్‌లను చూపించే రెండు రెండర్‌లను కంపెనీ షేర్‌ చేసింది. షేర్డ్ రెండర్ ప్రకారం, ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ను వైట్‌, బ్లాక్‌ కలర్‌లో తీసుకురానున్నారని తెలుస్తోంది.

ఇక రెడ్‌మీ టర్బో 3 స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో ట్రిపుల్ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందిస్తున్నారు. మెయిన్‌ కెమెరాతోపాటు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, మాక్రో కెమెరాలు ఉండనున్నాయి. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8ఎస్‌ జెన్‌3 ప్రాసెసర్‌ను అందించనున్నారు. నెట్టింట లీక్‌ అయిన సమాచారం ప్రకారం ఈ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను ఇవ్వనున్నారని తెలుస్తోంది.

అలాగే ఈ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన ఓఎల్‌ఈడీ స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. 120 హెచ్‌జెడ్‌ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్‌ సొంతం. అలాగే ఈ స్మార్ట్ ఫోన్‌లో 16 జీబీ ర్యామ్‌ను ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 90 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే బ్యాటరీని ఇవ్వనున్నారని తెలుస్తోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..