AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లగ్జరీ కార్ల ప్రియులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్త లుక్‌లో రేంజ్‌ రోవర్‌‌ ఎస్‌వీ!

Range Rover SV Duo-Tone Fade.. లగ్జరీ SUV అంటే గుర్తొచ్చే పేర్లలో Range Rover ముందుంటుంది. ఇప్పుడు Range Rover SVను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దుతూ కొత్త Duo-Tone Fade పెయింట్ ఫినిష్‌ను పరిచయం చేసింది. రెండు రంగులు క్రమంగా ఒకదానిలోకి మరొకటి కలిసిపోయే ఈ ప్రత్యేక డిజైన్‌తో SUV లుక్ మరింత ప్రీమియంగా మారింది. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా పలు పర్సనలైజేషన్ ఆప్షన్లను కూడా అందిస్తోంది.

లగ్జరీ కార్ల ప్రియులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్త లుక్‌లో రేంజ్‌ రోవర్‌‌ ఎస్‌వీ!
Range Rover Sv Duo Tone Fade
Nikhil
|

Updated on: Sep 13, 2026 | 6:10 AM

Share

ఖరీదైన SUV కొనుగోలు చేయడమే కాదు.. తమ కారు అందరిలో ప్రత్యేకంగా కనిపించాలని కోరుకునే లగ్జరీ కార్ల ప్రియుల కోసం Range Rover కొత్త ఆప్షన్‌ను తీసుకొచ్చింది. Range Rover SV Bespoke ప్రోగ్రామ్‌లో భాగంగా పరిచయం చేసిన Duo-Tone Fade పెయింట్ ఫినిష్ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఎక్స్‌టీరియర్ నుంచి ఇంటీరియర్ వరకు వ్యక్తిగత అభిరుచికి తగ్గట్టుగా కారును రూపొందించుకునే అవకాశం లభిస్తోంది.

రెండు రంగుల కలయికతో ప్రత్యేక లుక్

Range Rover SV Bespoke ప్రోగ్రామ్‌లో భాగంగా పరిచయం చేసిన Duo-Tone Fade పెయింట్ ఫినిష్ ఈ SUVకి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొస్తోంది. సాధారణ డ్యూయల్-టోన్ పెయింట్‌లో రెండు రంగుల మధ్య స్పష్టమైన విభజన కనిపిస్తుంది. కానీ Range Rover SVలో రెండు షేడ్స్ క్రమంగా ఒకదానిలోకి మరొకటి కలిసిపోయేలా ఈ ఫినిష్‌ను రూపొందించారు.

రూఫ్, బానెట్ నుంచి ప్రారంభమయ్యే కలర్ బ్లెండింగ్ క్రమంగా కారు సైడ్స్, వెనుక భాగం వరకు విస్తరిస్తుంది. Velvet Depths Obsidian – Sunrise Copper, Sunstone Luster Obsidian – Tourmaline Brown, Ashen Amaranthine Obsidian – Amethyst, Nacre Allure Obsidian – British Racing Green వంటి నాలుగు కలర్ కాంబినేషన్లను అందిస్తున్నారు. వీటికి సరిపోయే Duo-Tone ఇంటీరియర్ థీమ్‌లను కూడా ఎంచుకోవచ్చు.

ఈ ప్రత్యేకమైన ఫినిష్‌ను సాధారణ పెయింటింగ్ ప్రక్రియతో కాకుండా నైపుణ్యం కలిగిన నిపుణులు చేతితో బ్లెండ్ చేసి ఫినిషింగ్ ఇస్తారు. దీంతో ప్రతి Range Rover SV ప్రత్యేకంగా కనిపించే అవకాశం ఉంది.

ఎలక్ట్రిక్ వెర్షన్‌లో 600 కిలోమీటర్ల రేంజ్

పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే మార్కెట్‌ను బట్టి Range Rover SV పెట్రోల్, ఎలక్ట్రిక్ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లో 4.4 లీటర్ ట్విన్-టర్బో V8 మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్‌ను అందించారు. ఇది 537hp పవర్, 750Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 600 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంటోంది.

ఇంటీరియర్‌లోనూ Range Rover SV ప్రీమియం అనుభూతికి పెద్దపీట వేస్తోంది. 13.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 13.7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 4 జోన్ క్లైమేట్ కంట్రోల్, హెడ్-అప్ డిస్‌ప్లే, మసాజ్ ఫంక్షన్‌తో కూడిన వెంటిలేటెడ్ ఎలక్ట్రిక్ సీట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే Duo-Tone Fade పెయింట్ ఫినిష్‌కు సంబంధించిన అదనపు ధరను Range Rover ఇంకా వెల్లడించలేదు. కస్టమర్ ఎంచుకునే Bespoke కస్టమైజేషన్ల ఆధారంగా తుది ధర మారే అవకాశం ఉంది.

Follow Us