AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10 రోజుల బ్యాటరీ బ్యాకప్​తో కొత్త స్మార్ట్‌వాచ్​.. ఫీచర్లతో మతిపోగొట్టేస్తున్న Oppo.. ధర తెలిస్తే ఫిదా

స్మార్ట్‌వాచ్ కొనాలనుకునే వారికి ప్రముఖ టెక్ బ్రాండ్ ఒప్పో కొత్త మోడల్‌ను పరిచయం చేసింది. చైనాలో Reno 17 సిరీస్ స్మార్ట్‌ఫోన్లతో పాటు OPPO Watch 5ను కూడా లాంచ్ చేసింది. ఆకర్షణీయమైన స్క్వేర్ డిజైన్‌, AMOLED డిస్‌ప్లే, అధునాతన హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లతో ఈ వాచ్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 10 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టే వారిని ఆకట్టుకునేలా ఇందులో 100కు పైగా స్పోర్ట్స్ మోడ్‌లను అందించింది.

10 రోజుల బ్యాటరీ బ్యాకప్​తో కొత్త స్మార్ట్‌వాచ్​.. ఫీచర్లతో మతిపోగొట్టేస్తున్న Oppo.. ధర తెలిస్తే ఫిదా
Oppo Watch 5
Nikhil
|

Updated on: Nov 17, 2026 | 8:30 PM

Share

ప్రస్తుతం ఈ స్మార్ట్‌వాచ్ చైనాలో ప్రీ-ఆర్డర్లకు అందుబాటులో ఉంది. నవంబర్ 20 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. 1.85 అంగుళాల AMOLED స్క్రీన్‌, 3,000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, GPS, NFC వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు హార్ట్‌రేట్‌, బ్లడ్ ఆక్సిజన్‌, నిద్రకు సంబంధించిన వివరాలను ట్రాక్ చేసే సదుపాయాలు కూడా ఉన్నాయి. అయితే భారత మార్కెట్లో ఈ వాచ్‌ను ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై ఒప్పో ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

3,000 నిట్స్ బ్రైట్‌నెస్‌..

OPPO Watch 5లో ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్‌, GG5 గ్లాస్ ప్రొటెక్షన్ అందించారు. దీని మందం 9.2mm కాగా, స్ట్రాప్ లేకుండా బరువు 25 గ్రాములు. 5ATM వాటర్ రెసిస్టెన్స్‌తో పాటు IP69, IP69K రేటింగ్స్ ఉన్నాయి. ఇందులో 1.85 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 390 × 450 పిక్సెల్స్ రిజల్యూషన్‌, 322ppi పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి. సాధారణంగా 600 నిట్స్ బ్రైట్‌నెస్ అందించే స్క్రీన్‌, హై బ్రైట్‌నెస్ మోడ్‌లో 1,500 నిట్స్‌, అవుట్‌డోర్ స్పోర్ట్స్ మోడ్‌లో 3,000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ ఇస్తుంది. 3,000కు పైగా వాచ్ ఫేస్‌లను కస్టమైజ్ చేసుకునే అవకాశం ఉంది.

ఫిట్‌నెస్ కోసం వాకింగ్‌, రన్నింగ్‌, సైక్లింగ్‌, స్విమ్మింగ్‌, టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌ సహా 100కు పైగా వర్కౌట్ మోడ్‌లు ఉన్నాయి. FatMax మోడ్‌ వినియోగదారుల ఫిట్‌నెస్ డేటా ఆధారంగా కొవ్వు తగ్గించేందుకు అనుకూలమైన హార్ట్‌రేట్ పరిధిని సూచిస్తుంది. రోజంతా హార్ట్‌రేట్‌, బ్లడ్ ఆక్సిజన్ స్థాయిలను పర్యవేక్షించడంతో పాటు మణికట్టు ఉష్ణోగ్రత, స్లీప్ అనాలిసిస్‌, మెన్స్ట్రువల్ సైకిల్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

10 రోజుల బ్యాటరీ బ్యాకప్‌..

ఈ స్మార్ట్‌వాచ్‌లో 351mAh బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 10 రోజుల వరకు పనిచేస్తుంది. సాధారణ వినియోగంలో 7 రోజులు, Always-on Display ఆన్‌లో ఉంటే 3 రోజుల వరకు బ్యాకప్ ఇస్తుంది. మాగ్నెటిక్ ఛార్జింగ్ ద్వారా సుమారు 90 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. కనెక్టివిటీ కోసం Bluetooth 5.2, NFCతో పాటు BeiDou, GPS, Galileo, GLONASS, QZSS నావిగేషన్ సిస్టమ్‌లకు సపోర్ట్ ఉంది. Wi-Fi, eSIM సదుపాయాలు మాత్రం లేవు. Android 10, ఆపై వెర్షన్లు, iOS 16, ఆపై వెర్షన్లతో పనిచేస్తుంది. ColorOS Watch 17పై రన్ అవుతుంది.

ధర విషయానికి వస్తే Purple Encounter వేరియంట్ ధర 999 యువాన్లు (సుమారు రూ.14,060)గా ఉంది. Moonlight White, Fairy Trail Green, Wishing Orange, Starshine Black వేరియంట్ల ధర ఒక్కొక్కటి 899 యువాన్లు (సుమారు రూ.12,650)గా నిర్ణయించారు. ప్రస్తుతం చైనాలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌వాచ్‌ భారత మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందనే దానిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

Follow Us